ఈ భూమిపై జీవం ఎలా పుట్టింది? ఈ ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. ఐతే.. ఏడేళ్ల కిందట అసోం.. గోలఘాట్ జిల్లాలోని కమర్గావ్ పట్టణం దగ్గర్లో భూమిపై పడిన ఓ ఉల్క (Meteorite).. భూమి రహస్యాల్ని బయటపెట్టగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ ఉల్క రాయిలోని రసాయన సమ్మేళనాలను బట్టీ.. నక్షత్రాల మధ్యలో, నక్షత్ర దుమ్ములో జీవం పుట్టి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఆ ఉల్క రాయిని ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) పరిశోధకులు పరిశీలించారు. మన సౌరవ్యవస్థలో చాలా దూరం నుంచి వచ్చిన ఈ రాయిలో తొలిసారిగా.. ప్రత్యేక ఖనిజాలను కనిపెట్టారు. జీవం ఎలా పుట్టిందో తెలుసుకునేందుకు ఈ రసాయన సమ్మేళనాలు ఉపయోగపడతాయని వారు అంచనా వేశారు. ఇదే అంశంపై జపాన్ లోని హిరోషియా యూనివర్శిటీ, అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కూడా పరిశోధనలు చేస్తున్నాయి. వీరితో IIT పరిశోధకులు చేతులు కలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఉల్క రాయి.. అంగారక గ్రహం (Mars), గురుగ్రహం (Jupiter) మధ్య ఉన్న గ్రహశకలాల గుంపుకి చెందినది. 6.4 కిలోమీటర్ల సైజ్ ఉన్న గ్రహశకలం (Asteroid) నుంచి వీడిపోయిన రాళ్లు.. తోకచుక్క (comet)లా ఏర్పడ్డాయి. వాటిలో ఒక రాయి (Meteorite) తోకచుక్క నుంచి విడిపోయి వచ్చి భూమివైపు వచ్చింది. అలా వచ్చేటప్పుడు భూ వాతావరణంలో విపరీతమైన రాపిడి ఏర్పడింది. దాంతో పేలిపోయిన రాయి.. ముక్కలుగా భూమిపై పడింది. ఆ ముక్కలను శాస్త్రవేత్తలు సేకరించారు. వాటిని కమర్గావ్ ఉల్కగా పిలుస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
తమ పరిశోధన వివరాల్ని శాస్త్రవేత్తలు... జియోఫిజికల్ రీసెర్చ్-ప్లానెట్స్ అనే జర్నల్‌లో రాశారు. సౌరవ్యవస్థలో ఖగోళాలు ఏర్పడేందుకు ఖగోళాల ఉపరితలం, గ్రహశకలాల కలయిక కారణం అని వారు రాశారు. కమర్గావ్ రాయిలో సల్ఫర్, సోడియం, మాంగనీస్, ఐరన్ ఉన్నాయి. భూమిపై జీవం ఏర్పడటానికి ఇవి కీలకమైన మూలకాలు అని శాస్త్రవేత్తలు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)