ఇళ్లు అనేక రకాలు ఉంటాయి. కొన్ని భారీ ఖర్చుతో ..విలాసవంతంగా ఉండే ఇంటిని నిర్మించుకునే వాళ్లను చూశాం. కాని కాంబోడియాలో సీమ్ రీప్ అనే నగరానికి చెందిన చార్చ్ పాయు తన దగ్గరున్న డబ్బంతా ఖర్చు చేసి మరీ విమానాన్ని పోలిన ఇంటిని నిర్మించుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సుమారు 20వేల అమెరికన్ డాలర్లు ఖర్చు చేసి ఓ ప్రైవేట్ జెట్‌గా ఇంటిని మార్చేశాడు.ఈ ఆసక్తికరమైన వార్తను, ఫోటోలను ఏఎఫ్‌పీ వార్త సంస్థ సేకరించింది. (Photo AFP)
ఇల్లు విమానంలా కట్టుకోవాలని నిర్ణయించుకోగానే ఇంటర్నెట్లో ప్రైవేట్ జెట్ల వీడియోలు, వాటిని ఎలా నిర్మిస్తారనే విషయాలు తెలుసుకున్నాడు. ఇక డిజైన్ ఆధారంగా ఇంటిని నిర్మించుకున్నాడు. ప్రస్తుతం చార్చ్ నిర్మించుకున్న ఇల్లు అందర్ని ఆకర్షిస్తోంది. అలాంటి ఇంట్లో నివసించలేకపోయినా..కనీసం ఆ ఇంటి దగ్గర నిల్చొని ఓ ఫోటో దిగుతున్నారు, కొందరైతే యజమాని చార్చ్తో కలిసి ఇంటి దగ్గర సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈవిమానం హౌస్‌ని చూడటానికి వచ్చే వాళ్ల దగ్గర టికెట్ డబ్బులు వసూలు చేస్తున్నాడు. (Photo AFP)