ప్రపంచంలోని చాలా మంది ప్లాస్టిక్ సర్జరీల మోజులో పడి.. అసలు తాము ఏం చేస్తున్నారో మర్చిపోతున్నారు. ఈ సర్జరీల సంస్థలు కూడా.. అది బెటర్, ఈ ప్రొసీజర్ సూపర్ అంటూ.. వారిని ఊరిస్తున్నాయి. దాంతో.. భారీగా డబ్బు సమర్పించుకొని.. ఏదో అవ్వాలనుకొని.. ఇంకేదో అవుతున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కథ. (image credit - instagram - beeray416)
అతని పేరు బ్రియాన్ రే. మాజీ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్లా కనిపించాలి అనుకున్నాడు. అందుకు రకాల సర్జరీలు చేయించుకున్నాడు. దాదాపు రూ.97 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు చేతిలో పెప్పర్ స్ప్రే, టాసెర్ గన్ (taser gun) పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎందుకంటే ఎక్కడికి వెళ్లినా జనం దాడి చేసి.. కొడుతున్నారు. (image credit - instagram - beeray416)
బ్రియాన్ లాంటి చాలా మందికి ఆత్మన్యూనతా భావం ఉంటుంది. వారు తాము తాములా కనిపించడాన్ని ఇష్టపడరు. మరెవరిలాగో ఉండి ఉంటే బాగుండేది అనుకుంటారు. బ్రియాన్ లాంటి డబ్బున్నవారు.. సర్జరీలతో మార్పులు చేయించుకుంటారు. దాని వల్ల పైపై లుక్ మారుతుందేమో గానీ.. వారిలో ఆత్మన్యూనతాభావం మాత్రం మారదు. అందువల్ల వారు కంటిన్యూగా సర్జరీలు చేయించుకుంటూనే ఉంటారు. బ్రియాన్ పరిస్థితి కూడా అంతే అంటున్నారు మానసిక వేత్తలు. (image credit - instagram - beeray416)