మలేసియా మాజీ రాజు సంచలన ప్రకటన... మాజీ మిస్ మాస్కోకి త్రిపుల్ తలాఖ్...
మలేసియా మాజీ రాజు సంచలన ప్రకటన... మాజీ మిస్ మాస్కోకి త్రిపుల్ తలాఖ్...
Malaysia : త్రిపుల్ తలాఖ్ చెప్పలేదంటున్న మాజీ మిస్ మాస్కో... సుల్తాన్ మొహమ్మద్ ని తన భర్తగానే భావిస్తానని తెలిపింది. సోషల్ మీడియాలో తమ ఇద్దరి ఫొటోలను షేర్ చేస్తానని ప్రకటించింది.
మలేసియా మాజీ రాజు సుల్తాన్ మొహమ్మద్ వి... తన భార్య, రష్యా మాజీ బ్యూటీ క్వీన్... మిస్ రిహనా ఒక్సానా గోర్బటెంకోకి విడాకులు ఇచ్చినట్లు తెలిసింది. ఇందుకోసం ఆయన త్రిపుల్ తలాఖ్ చెప్పినట్లు సమాచారం. (Image : Instagram/rihanapetra)
2/ 11
పెళ్లైన రెండేళ్లకే ఈ విడాకుల ప్రకటన రావడం విచారకరం. దీనిపై మలేసియా ప్రజలు సంతోషంగా లేరు. (Image : Instagram/rihanapetra)
3/ 11
త్రిపుల్ తలాఖ్ చెప్పలేదంటున్న మాజీ మిస్ మాస్కో... సుల్తాన్ మొహమ్మద్ ని తన భర్తగానే భావిస్తానని తెలిపింది. సోషల్ మీడియాలో తమ ఇద్దరి ఫొటోలను షేర్ చేస్తానని ప్రకటించింది. (Image : Instagram/rihanapetra)
4/ 11
మలేసియా అధికార పీఠం ఎక్కిన రెండేళ్ల తర్వాత 2019 జనవరిలో ఆ పదవి నుంచీ తప్పుకున్నారు సుల్తాన్ మొహమ్మద్. (Image : Instagram/rihanapetra)
5/ 11
గతేడాది వీళ్ల పెళ్లి విషయం తెరపైకి వచ్చాక... అప్పటి నుంచీ మెడికల్ లీవ్‌లో ఉన్నారు సుల్తాన్ మొహమ్మద్. (Image : Instagram/rihanapetra)
6/ 11
ఇలా ఓ రాజు స్థానంలో వ్యక్తి... త్రిపుల్ తలాఖ్‌తో విడాకులు ఇవ్వడం మలేసియా చరిత్రలో ఇదే తొలిసారి. 2019 జూన్ 22న ఇది జరిగినట్లు సింగపూర్‌కి చెందిన సుల్తాన్ తరపు లాయర్ కోహ్ తిన్ హ్వా తెలిపారు. (Image : Instagram/rihanapetra)
7/ 11
సుల్తాన్‌గా ఉంటూ, మొహమ్మద్... విడాకుల పత్రం (డైవర్స్ సర్టిఫికెట్) జారీ చేసినట్లు మలేసియా... కెలాంతన్లోని ఇస్లామిక్ కోర్టు ప్రకటించింది. (Image : Twitter)
8/ 11
మిస్ రిహనా ఒక్సానా గోర్బటెంకో మాత్రం తనకు విడాకులు ఇచ్చిన విషయమే తెలియదని అంటోంది. మేలో ఆమె ఓ పిల్లాడికి జన్మనిచ్చింది. తమ ఫొటోలను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేస్తానని తెలిపింది. (Image : Instagram/rihanapetra)
9/ 11
ఆ పిల్లాడికి సుల్తానే తండ్రి అనేందుకు బయోలాజికల్ ఆధారాలు లేవని సుల్తాన్ తరపు లాయర్ కోహ్ తిన్ అంటున్నారు. (Image : Instagram/rihanapetra)
10/ 11
మలేసియాలో అధికార పీఠం ప్రతి ఐదేళ్లకోసారి సామ్రాజ్య అధినేతల చేతులు మారుతుంది. అక్కడి తొమ్మిది రాష్ట్రాల్లోని రాయల్ పాలకులు... ఒకరి తర్వాత ఒకరు అధికారాన్ని దక్కించుకుంటారు. (Image : Instagram/rihanapetra)
11/ 11
తాజా పరిణామం రాజకీయంగా, పరిపాలనా పరంగా కలకలం రేపుతోంది. (Image : Instagram/rihanapetra)