Mumbai Auto Photos : ఈ ఆటోని అందరూ ప్రేమిస్తారు.. ఎందుకో తెలుసా?
Mumbai Auto Photos : ఈ ఆటోని అందరూ ప్రేమిస్తారు.. ఎందుకో తెలుసా?
Mumbai Auto Photos : మనం మనుషులతో ప్రేమలో పడతాం గానీ.. ఆటోలతో పడం. కానీ ఈ ఆటో ప్రత్యేకం. ఇది ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది. ఇందులో ప్రయాణించాలని అందరూ కోరుకుంటారు. కారణం దాని ఓనర్. ముంబైలో ఆ ఆటో జానీ విశేషాలు తెలుసుకుందాం.
ముంబైలోని కొందరు ఆటో డ్రైవర్లు... కస్టమర్ల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేయడానికి కొన్ని సదుపాయాలను తమ ఆటోలలో అందిస్తారు. ఈ తరహా ప్రత్యేకమైన ఆటో ప్రస్తుతం ముంబై రోడ్లపై దూసుకెళ్తోంది.
2/ 8
మీరు కుర్లా, అంధేరి, బాంద్రాలో ప్రయాణిస్తున్నట్లయితే.. మీకు అక్కడ ఈ ఆటో కనిపించే అవకాశం ఉంటుంది.
3/ 8
ఈ ఆటో ఓనర్ సత్యవాన్. తన ఆటోలో ఫోన్ ఛార్జింగ్ చేయడానికి ఛార్జింగ్ పాయింట్, డెస్క్‌టాప్ మానిటర్, తాగడానికి శుభ్రమైన నీరు, చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశాడు.
4/ 8
అంతేకాదు.. అతను ఆటో అందంగా ఉండేందుకు మొక్కలను కూడా సెట్ చేశాడు. వాటికి పూలు కూడా వస్తాయి. వాటిని చూసిన ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
5/ 8
మహిళలు, అమ్మాయిలకు మేకప్ చేసుకునే సమయం లేకపోతే.. అతని ఆటోలో కూర్చొని హాయిగా మేకప్ చేసుకోవచ్చు. అందుకోసం ఒక మేకప్ బాక్స్, ఒక అద్దం కూడా ఉంచాడు.
6/ 8
ప్రయాణికులను చల్లగా ఉంచేందుకు సత్యవాన్ తన ఆటోలో ఫ్యాన్‌ను అమర్చాడు. అదే సమయంలో వారు ముఖం కడుక్కోవడానికి వాష్ బేసిన్ కూడా ఉంచాడు.
7/ 8
ముంబైలో వాహనదారులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో తన ఆటో మీద ట్రాఫిక్ రూల్స్ రాసుకున్నాడు సత్యవాన్.
8/ 8
ఆ రూల్స్ చదివి, ఆటోలో ఉన్న సకల సౌకర్యాలు చూసి ప్రతి కస్టమర్ సంతోషిస్తున్నారు. సత్యవాన్ని మెచ్చుకుంటున్నారు.