దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మరోసారి విలయం స్థాయికి చేరింది. కంగారు పడొద్దని ప్రభుత్వాలు చెబుతున్నా, కొత్త కేసులు, మరణాలు భారీ స్థాయిలో పెరుగుతుండటంతో అవే ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. రాబోయే రోజుల్లో తోపాటు ఇతర వేరియంట్లూ స్వైరవిహారం చేసే అవకాశాలుండటంతో సరికొత్త ఆంక్షలను ప్రకటిస్తున్నాయి.
నెల్లూరు లాక్డౌన్ కేసులు, కరోనా కేసులు, నెల్లూరు లాక్డౌన్ కేసులు, ఏపీ కరోనా కేసులు" width="1200" height="800" /> ఇతర వేరియంట్లతోపాటు మహారాష్ట్రలో ఒమిక్రాన్ సైతం అలజడి రేపుతున్నది. కొత్తగా 133 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1009కి చేరింది. రాష్ట్రంలో వైరస్ ఉధృతి తీవ్రంగా ఉండటంతో సోమవారం నుంచి రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేయనున్నారు.
కరోనా ఆంక్షలను విస్తరిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం(జనవరి 10) నుంచి బ్యూటీ సెలూన్లు, ఎమ్యూజ్మెంట్ పార్కులు, జూపార్కులు, మ్యూజియమ్స్, ఇతర టూరిస్టు ప్రదేశాలను మూసివేస్తారు. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు రవాణా, కార్యాలయాలు 50 శాతం ఆక్యుపెన్సీతోనే పనిచేయాలి.