Chicken Vada Pav : చికెన్ వడ పావ్.. హిట్ కాంబినేషన్.. ఫొటోలు చూడండి
Chicken Vada Pav : చికెన్ వడ పావ్.. హిట్ కాంబినేషన్.. ఫొటోలు చూడండి
Chicken Vada Pav : ఇప్పటివరకూ వడ పావ్లో ఆలూ, ఉల్లి, పచ్చిమిర్చి ఇతరత్రా ఉన్నాయే తప్ప.. చికెన్ లేదు. ఇప్పుడీ కొత్త కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యింది. ఫుడ్ లవర్స్ తెగ లాగించేస్తున్నారు.
ఒకప్పుడు మహారాష్ట్రలో వడ పావ్ అంటే.. ముంబైకి మాత్రమే పరిమితమైన స్నాక్. ఇప్పుడు మహారాష్ట్ర అంతటా అది ప్రసిద్ధి చెందింది. ఏ ఏరియాలో చూసినా వడ పావ్ స్టాల్స్ కనిపిస్తున్నారు. వాటిని తినేందుకు భారీగా జనం వస్తున్నారు.
2/ 10
తిండిగింజల నగరంగా పేరున్న కొల్హాపూర్‌లో తొలిసారిగా కొత్త తరహాలో... చికెన్ వడ పావ్ అందుబాటులోకి వచ్చింది.
3/ 10
ఈ చికెన్ - వడపావ్ కాంబినేషన్ కొల్హాపూర్‌లో బాగా ఫేమస్ అయ్యింది. టేస్ట్ అదిరిపోయింది అంటూ ఫుడ్ లవర్స్ తెగ లాగించేస్తున్నారు.
4/ 10
కొల్హాపూర్‌లోని మహావీర్ కాలేజీ ప్రాంతంలో నివసించే మయూర్ భోంస్లే.. తన స్టాల్లో చికెన్ వడ పావ్‌ను ప్రారంభించాడు. ఈ రకాన్ని ప్రారంభించే ముందు, అతను దానిని ఒక వారం పాటు ట్రయల్ వేశాడు.
5/ 10
నాన్ వెజ్ బర్గర్ లాగా ఉండే ఈ చికెన్ వడ పావ్.. స్థానికులకు బాగా నచ్చింది. ఇక్కడ రోజూ రద్దీ పెరుగుతోంది.
6/ 10
మయూర్ భోంస్లేకి చికెన్ 65, చికెన్ ఖీమా రోల్స్ బండి ఉంది. ఇలాంటి బండి పెట్టుకోమని అతని స్నేహితులు అతనికి సలహా ఇచ్చారు.
7/ 10
బంగాళాదుంప వడపావ్ తయారీ కోసం శనగపిండి మిశ్రమాన్ని తయారుచేస్తారు. ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి శనగపిండి, కారం, ఉప్పు, ఓట్స్ వాడుతారు.
8/ 10
ఇక్కడ చికెన్ వడ పావ్లో వడ లోపల సగ్గుబియ్యం, ఎముకలు లేని చికెన్ కూరుతున్నారు.
9/ 10
కస్టమర్లకు ఇచ్చే ముందు.. ఇంట్లో తయారుచేసిన పుదీనా చట్నీ, వెజిటబుల్ చట్నీ, మయోనైస్ సాస్ని వడ మధ్యలో వేసి సెర్వ్ చేస్తున్నారు.
10/ 10
సాధారణ వడ పావ్ ప్రతిచోటా 10 నుంచి 15 రూపాయలకు దొరుకుతుంది. మయూర్ తాను చేసే వడలో చికెన్ వాడుతున్నాడు. ఆ వడ ధర రూ.20 అని తెలిపాడు.