అక్కడే ఉన్న మహిళ స్టాఫ్ లతో మాట్లాడి పోలీస్ స్టేషన్ లోనే ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించారు. మహిళా పోలీసును కూర్చోబెట్టి, పండితులను, ఆమె కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఉల్లాసంగా సీమంతం నిర్వహించారు. అంతే కాకుండా.. స్టేషన్ ఇన్ఛార్జ్ నుంచి కానిస్టేబుల్ వరకు పాల్గొని సగ్గుబియ్యం వేడుకను ఘనంగా నిర్వహించారు.
తీజ్ పండుగ కారణంగా సెలవు లభించకపోయిన మహిళ పోలీసు జీవితంలో మర్చిపోలేని విధంగా వేడుక నిర్వహించారు. అందరూ కుటుంబ సమేతంగా ఈ క్రతువులను నిర్వహించి ఆశీస్సులు అందజేశారు. ఇదంతా జరిగిన తర్వాత మహిళా కానిస్టేబుల్, అర్పణ కూడా చాలా ఆనందంగా కనిపించారు. తన అత్తమామలు, అత్తవారింటికి చేరుకోలేక పోయినా పోలీస్ స్టేషన్ సిబ్బంది చేసే కుటుంబ ఆచారాలు తనకు చాలా సంతోషాన్నిచ్చాయని అర్పణ చెప్పింది.
పోలీస్ స్టేషన్లో ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరగాలని, అందరిలో ఉత్సాహం పెరుగుతుందన్నారు. కాగా, గత ఏడాది ఏప్రిల్‌లో భోపాల్‌కు చెందిన ప్రఖర్ శర్మతో అర్పనా కటారే వివాహం జరిగింది. ఆమె తల్లి ఇల్లు తికమ్‌ఘర్‌లో ఉంది. సిబ్బంది చేపట్టిన ఈ విశిష్ట చొరవ పట్ల అర్పణ హర్షం వ్యక్తం చేశారు. తన జీవితంలో దీన్ని ఈ వేడుకను ఎప్పటికి మర్చిపోలేనని అర్పణ అన్నారు.
ఇప్పటి వరకు మనం పోలీస్ స్టేషన్ లో తరచుగా ప్రేమ పెళ్లిళ్లు జరగటమే చూస్తున్నాం.. ఇక ఇప్పుడు సీమంతం కూడా నిర్వహించడంతో ప్రస్తుతం ఈ ఘటన పోలీస్ స్టేషన్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు వేడుకను నిర్వహించిన, సదరు పోలీసులను శభాష్ అంటూ మెచ్చుకుంటున్నట్లు సమాచారం. ఈ ఘటన మాత్రం వార్తలలో నిలిచింది.