బీహార్.. భోజ్‌పూర్‌లోని బధరా బ్లాక్‌లో ఉన్న కృష్ణగఢ్ పోలీస్ స్టేషన్లో 29 సంవత్సరాలుగా బంధించిన హనుమంతుడు, రామానుజ స్వామి విగ్రహాలకు స్వేచ్ఛ లభించింది. ఆరా కోర్టు ఆదేశాలతో మంగళవారం.... అష్టధాతువులతో తయారుచేసిన విగ్రహాల్ని విడుదల చేశారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన హనుమాన్ జీ, రామానుజ స్వామి విగ్రహాలను చూడటానికి ప్రజలు పోలీస్ స్టేషన్ ఆవరణ మొత్తం కిక్కిరిసిపోయారు. అక్కడే పూజలు ప్రారంభమయ్యాయి.
వాస్తవానికి 1994లో బర్హారాలోని కృష్ణగఢ్ పోలీస్ స్టేషన్‌లోని తూర్పు గుండిలో... దక్షిణ భారతదేశంలోని ఆలయాల తరహాలో నిర్మించిన రంగనాథ్ ఆలయంలో దొంగలు చోరీ చేశారు. హనుమాన్, రామానుజ స్వామి అష్టధాతువుల విగ్రహాలు చోరీ అయ్యాయి. కొన్ని నెలల తర్వాత అర్రా నగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని సింఘి గ్రామంలో ఉన్న ఓ తోటలో పోలీసులు వాటిని కనుగొన్నారు. వాటిని కృష్ణగఢ్ పోలీస్ స్టేషన్లో ఉంచారు.
ఆ విగ్రహాలకు సరైన భద్రత లేదనే ఉద్దేశంతో పోలీసులు వాటిని తిరిగి ఆలయానికి ఇవ్వలేదు. వాటికి భద్రత కల్పించేందుకు పాలకులు, అధికారులూ ప్రత్యేక ఆసక్తి చూపలేదు. దాంతో 29 ఏళ్లుగా అవి స్టేషన్లోనే ఉన్నాయి. 11 నెలల కిందట, మహావీర్ మందిర్ న్యాస్ సమితి కార్యదర్శి ఆచార్య కిషోర్ కునాల్ రెండు విగ్రహాల గురించి తెలుసుకున్నారు. వాటి గురించి భోజ్‌పూర్ పోలీసుల్ని కలిసి మాట్లాడారు. విగ్రహాలకు పూర్తి రక్షణ కల్పిస్తామని మాట ఇవ్వడంతో.. పోలీసులు మెట్టు దిగారు.