సింగపూర్ ఎయిర్‌లైన్స్ నియంత్రణలో ఉన్న సింహాలను కనిపెట్టడంతో.. వాళ్లు వెంటనే మండై వైల్డ్‌లైఫ్ గ్రూప్‌కు ఫోన్ చేసి విషయం తెలిపారు. వాళ్లు వెంటనే సింహాలను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అక్కడి చేరుకుని వాటికి మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత వాటిని నియంత్రణలోకి తీసుకున్నారు. దీని తరువాత వాటిని బోనులో తీసుకున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
కొంత సేపటికి వరకు అవి తమ బోను మీదే కూర్చుని ఉన్నాయి. ఆ తరువాత మెల్లిగా విమానాశ్రయం ఆవరణలో నడుస్తూ కనిపించాయి. సింహం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, విమాన ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలిగించలేదని సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. అయితే సింహం బోను ఎలా తెరుచుకుందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు.(ప్రతీకాత్మక చిత్రం)