గుజరాత్... పంచమహల్ జిల్లాలో జరిగిందో దారుణం. ఈ జిల్లాలో తరచూ చిరుతపులులు తిరుగుతున్నాయి. అప్పుడప్పుడూ స్థానికులకు అవి కనిపిస్తున్నాయి. తాజాగా... ఘోఘంబా తాలూకాలో... ఓ చిరుత పంజా విసిరింది. ఎటు నుంచి వచ్చిందో గానీ... పొలం దగ్గర ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేసి... చంపేసింది. మృతదేహాన్ని ముక్కలుగా చీల్చేసింది. ఇదంతా ఎలా జరిగింది? ఆ చిన్నారిపై చిరుత దాడి చేస్తుంటే... స్థానికులు ఎందుకు కాపాడలేకపోయారు అన్న ప్రశ్నలు మనకి రావచ్చు.
ఈ ఘోఘంబా తాలూకాకు దగ్గర్లోనే ఓ అడవి ఉంది. అక్కడ మేన్ ఈటర్ (మనుషుల రక్తం రుచిమరిగిన చిరుతపులి) తిరుగుతోంది. అది అడవిలో జంతువుల్ని వేటాడి తింటే ప్రకృతి ధర్మం అనుకోవచ్చు. కానీ దానికి జంతువుల కంటే మనుషుల మాంసం నచ్చుతోంది. అందుకే అది అడవి వదిలి అప్పుడప్పుడూ ఘోఘంబాకి వస్తోంది. ఈ విషయాన్ని ఎన్నోసార్లు స్థానికులు... అటవీ అధికారులకు చెప్పారు. కానీ ఆ దట్టమైన అడవిలో ఆ చిరుతను కనిపెట్టడం వారి వల్ల కావట్లేదు. ప్రతిసారీ ఇక రాదులే అని సరిపెడుతున్నారు. కానీ అది మళ్లీ మళ్లీ వస్తూ... ఆవుల్ని తింటూ భయపెడుతోంది. ఈసారి ఏకంగా చిన్నారినే తినేసింది.
8 ఏళ్ల పిల్లాడు. గొర్రెల్ని కాస్తూ... అడవికి దగ్గరగా వెళ్లాడు. ఐతే... ఆ పిల్లాడి ఇల్లు అక్కడికి దగ్గర్లోనే ఉంది. అందువల్ల ఏం కాదులే అనుకున్నాడు ఆ చిన్నారి. కానీ ఆ చిరుత మామూలుది కాదు కదా. గొర్రెలను చూసింది. కానీ వాటిని తినాలని దానికి అనిపించలేదు. ఆ పిల్లాణ్ని చూసింది. మనిషిని చంపి తినాలనే కోరికతో ఉన్న చిరుత... ఆ చిన్నారిపై కన్నేసింది. చుట్టుపక్కల ఎవరూ లేరు. అంతే... కాసేపటి తర్వాత గొర్రెలున్నాయి గానీ... చిన్నారి కనిపించలేదు. దూరం నుంచి కొందరు చిరుత వచ్చిందని చెప్పడం... ఆ తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో... కలకలం రేగింది. కాల్ వెళ్లింది. అటవీ అధికారులు వచ్చారు. అడవిలో వెతికారు. అక్కడ చిన్నారి డెడ్ బాడీ అత్యంత దారుణంగా కనిపించింది. అంటే... చిన్నారిని చంపి... ఈడ్చుకుపోయి... అడవిలో కొంత తినేసి... మిగతా బాడీని వదిలేసి పోయిందన్నమాట.
తన ఇంటి దగ్గర ఉన్న ఓ బావి లోంచీ నీరు తీసుకుంటోంది బాలిక. ఆ సమయంలో... అటుగా వచ్చిన పులి... ఆ బాలికపైకి దూకింది. అప్పటికే అది చూసిన పాప... వామ్మో అనుకుంటూ... పరుగు మొదలుపెట్టింది. పులి పంజా నుంచి తప్పించుకుంది. అక్కడికి దగ్గర్లోనే ఇళ్లు ఉండటంతో... ఆ పులి కాస్త నెమ్మదించింది. దాంతో... బాలిక పరుగెడుతూ... దాదాపు అర కిలోమీటర్ పారిపోయింది. ఆ తర్వాత ఆ పులి ఎటు వెళ్లిందో తెలియలేదు. స్థానికులకు టెన్షన్ పట్టుకుంది. ఆ చిన్నారి తనను తాను రక్షించుకోవడాన్ని స్థానికులు మెచ్చుకుంటున్నారు. ఇలా మృగాలు మనుషుల ఏరియాల్లోకి వచ్చి దాడులు చేస్తుండటం... పంచమహల్ జిల్లాలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.