మామూలుగా రోజూ లాగే పనివారు... టీ గార్డెన్ లోకి వెళ్లి... లేత తేయాకులను ఒక్కొక్కటిగా కోసి... వెనక ఉన్న బుట్టల్లో వేసుకుంటున్నారు. బెంగాల్ రాజకీయాలు, కరోనా, ప్రభుత్వ పథకాలు ఇలా ఏవేవో మాట్లాడుకుంటూ పనిలో ఉన్నారు. ఇంతలో కొన్ని ఆకులు కదులుతూ కనిపించాయి. ఆశ్చర్యంగా చూశారు. అక్కడ ఎవరూ లేరు. గాలి కూడా ఊగట్లేదు. మరైతే అక్కడ ఎందుకు కదులుతున్నాయి అని చూస్తూ ఉండగా... వారిలో ఒకరికి సన్నటి మచ్చల చిరుతపులి తనవైపే చూస్తూ కనిపించింది. అంతే... "వామ్మో చిరుత బాబోయ్ చిరుత... అమ్మో అమ్మో" అనుకుంటూ... తట్టా బుట్టా అన్నీ అక్కడే వదిలేసి... పనివారంతా పరుగులు పెట్టారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఆ క్షణం ఆ చిరుత తమను పట్టుకుంటుందేమో, దాడి చేస్తుందేమో. అది దగ్గరకు వస్తే ఏం చెయ్యాలి, దాన్ని ఎలా అడ్డుకోవాలి... ఇలా వారి మనసుల్లో ఎన్నో ఆలోచనలు వచ్చాయి. ఆ తర్వాత టీ గార్డెన్ ఓనర్లకు విషయం చెప్పారు. కాసేపటికే విషయం ఊరంతా తెలిసిపోయింది. ఊరోళ్లంతా అక్కడికి వచ్చి... ఏదీ ఎక్కడుంది... అని చూడటం మొదలుపెట్టారు. గార్డెన్ ఓనర్ కాల్ చేసి చెప్పడంతో... అటవీ అధికారులు అక్కడికి వచ్చారు. పులి కోసం అంతా వెతికారు. ఎక్కడా అది కనిపించలేదు. ఇక్కడ చిరుత లేదు అని వాళ్లు చెప్పడంతో... కూలీలు ఊపిరి పీల్చుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
అక్కడకు వచ్చిన అధికారులతో టీ గార్డెన్ ఓనర్ వివరంగా మాట్లాడారు. తరచూ చిరుత వస్తోంది కాబట్టి... అక్కడో బోన్ ఏర్పాటు చెయ్యమని కోరారు. అధికారులేమో... బోన్ పెట్టడానికి తమకేమీ అభ్యంతరం లేదనీ... లిఖితపూర్వకంగా విజ్ఞప్తి ఇస్తే పరిశీలిస్తామని చెప్పారు. ఇలా ఇప్పటికి సమస్య తాత్కాలికంగా ముగిసింది. ఏదేమైనా చిరుత భయంతో ఆ పనివారు బిక్కుబిక్కుమంటూ పనిచేయాల్సిందే. క్షణక్షణం టెన్షనే. (ప్రతీకాత్మక చిత్రం)