రెంట్(Rent) చూస్తే కళ్లు తిరుగుతాయ్.. డిపాజిట్ రేట్(Rate) చూస్తే కళ్లే కాదు.. మనిషి కూడా గుండ్రంగా తిరిగి కిందపడతాడు. ఐటీ హబ్ బెంగళూరు(Bengaluru)లో ఇంటి అద్దె కట్టాలంటే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా.. ఎందుకంటే రెండు, మూడు నెలల డిపాజిట్ కాదు.. కొన్ని చోట్ల ఐదు నెలల రెంట్.. మరికొన్ని చోట్ల ఏకంగా 10నెలల డిపాజిట్ చేయాల్సిందే! చిన్న డబుల్ బెడ్ రూమ్ రెంటే దాదాపు 30వేలు దాటుతుంది. (Image tweeted by ramyakh)
ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఆప్షన్ను చాలా కంపెనీలు సడలిస్తున్నాయి. దీంతో టెక్కీలు మళ్లీ బెంగళూరు బాట పడుతున్నారు. ఈ రెండేళ్ల పాటు తగ్గించన ధరలతో కాలం గడిపిన ఇంటి ఓనర్లు.. ఇప్పుడు ఆకాశమే హద్దుగా రెంట్ పెంచేశారు. ఇక ఎలాగోలా డిపాజిట్ కట్టి.. అద్దె తీసుకుంటే అక్కడితో సమస్య తీరిపోదు.. మనం ఇల్లు ఖాళీ చేసేటప్పుడు పెయింటింగ్ వేయించాలన్న రూల్ కూడా పెడుతున్నారట..! ఒక నెల ఉన్నా.. రెండేళ్లున్నా.. రూల్ ఇజ్ రూల్.. (Image Credits Nuora)