ఒడిశాలోని బెర్హంపూర్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సిహెచ్ నాగేషు పాత్రో తనకు లాగా మరెవరూ చదువుకోసం ఇబ్బంది పడకూడదని తాను పార్ట్‌టైమ్ కూలీగా మారాడు. కరోనా మహమ్మారి దెబ్బకు ఉద్యోగం కోల్పోయిన సమయంలో ట్యూషన్లు చెప్పుకుంటూ కాలం వెళ్లదీసిన నాగేషు పాత్రో ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శవంతంగా నిలిచాడు.
ఏదో విధంగా తన సొంత కాళ్లపై నిలబడాలనే తపనతో తిరిగి ఒడిషా చేరుకోవాలనుకున్నాడు. అయితే ఈమధ్య కాలంలోనే హైదరాబాద్‌లోని ఒక మాల్లో సేల్స్‌మెన్‌గా అటుపై నగరంలో రైల్వే పోర్టర్‌గా కూడా పనిచేశాడు. ఆ విధంగా వచ్చిన డబ్బుతో ఇంటర్, డిగ్రీ పాసై చివరకు బెర్హంపూర్ యూనివర్సిటీ నుంచి పీడీ పట్టా పొందాడు నాగేషు పాత్రో.
జీవితం నేర్పిన బతుకు పాఠమే నాగేషు పాత్రోని కాలేజీలో పాఠాలు చెప్పే లెక్చరర్‌గా మార్చింది. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలన్న మాటను ఆదర్శంగా చేసుకొని తాను పడినట్లుగా చదువు కోసం మరెవరూ పేద విద్యార్ధులు ఇబ్బందులు పడకూడదని ఈవిధంగా పార్ట్‌టైమ్ రైల్వే కూలీగా పని చేస్తూ వచ్చిన డబ్బును పేద విద్యార్ధుల విద్యకు ఉపయోగిస్తున్నాడు.