కేరళ సోషల్ మీడియా సెలబ్రిటీగా పేరు సంపాధించుకున్న హనన్ అనే యువతి ఓ పోకిరికి తగిన బుద్ది చెప్పింది. స్కూల్ యూనిఫాంలో చేపలు అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన హనన్ సెల్‌ఫోన్‌కి అసభ్యకరమైన మెసేజ్‌లు, ఫోటోలు పంపిస్తున్న వ్యక్తిని చాకచక్యంగా తానే పిలిపించి పోలీసులకు అప్పగించింది. పట్టుబడిన పోరంబోకు కుంబళంగికి చెందిన జోసెఫ్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. హనన్ ఈ పోకిరిని పథకం ప్రకారం కొచ్చికి పిలిపించి పోలీసులకు అప్పగించింది.