కజకిస్తాన్ దేశానికి చెందిన యూరి టొటోచ్కో బాడీ బిల్డర్ గా పాపులర్ అయ్యాడు. 36 ఏళ్ల యూరీకి వివిధ రకాల వ్యాపారాలు కూడా ఉన్నాయి. కలిగిన కుటుంబంలో పుట్టిన ఇతనికి పెళ్లి పట్ల ఉన్న అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. అవును, స్థితిమంతుడు కావడంతో ఎంతో మంది మగువలు అతణ్ని పెళ్లడుతామని చెప్పినా, యూరీ మాత్రం ఎంచక్కా సెక్స్ డాల్ ను జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు.
కజకిస్తాన్ బాడీ బిల్డర్ యూరీకి ఇన్ స్టాగ్రామ్ లో 1,10,000 మంది ఫాలోవర్లున్నారు. గతేడాది సెక్స్ డాల్ ను పెళ్లి చేసుకోవడం ద్వారా అతను అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. సెక్స్ డాల్ భార్యలతో కబుర్లు చెబుతూ, రోజువారీ పనుల మధ్య వాటితో మాట్లాడుతూ, ఎక్కడికి షికారుకెళ్లినా బొమ్మ భార్యను వెంటే తీసుకెళుతూ, సంబంధిత ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తాడతను.
‘ఇది పూర్తిగా బిజినెస్ ట్రిప్. కానీ ఈ వెకేషన్ ను హనీమూన్ గా మలచుకోవాలని మేం భావించాం. బల్గేరియాలో వారం రోజులపాటు అద్బుతమైన సమయాన్ని మేమిద్దరం గడిపాం. వర్క్ టైమ్ లో చాలా మందిని కలుస్తూ, హోటల్ రూమ్ లో రొమాన్స్ చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేశాం’అని రెండో భార్యతో హనీమూన్ తాలూకు విశేషాలు పంచుకున్నాడు యూరి.