kajal aggarwal: టాలీవుడ్లో గత 15 ఏళ్ళ నుంచి తన అందంతో.. నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇటీవలే ఓ ఇంటి కోడలైన కాజల్ పెళ్లి తర్వాత కూడా అదే గ్లామర్ మెయిన్టెయిన్ చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి లాహే లాహే అనే లిరికల్ పాటను చిత్ర బృందం మూడు రోజుల క్రితం విడుదల చేసింది. Kajal Aggarwal in Acharya movie Photo : Youtube
ఈ పాట గత మూడు రోజుల నుంచి యూట్యూబ్లో ట్రెండ్ అవుతూనే ఉంది. అయితే ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ లుక్ ఎలా ఉండనుంది అనేది ఈ లిరికల్ పాట ద్వారా తెలిసింది. దీంతో ఈ పాటలోని కాజల్ స్టిల్స్ స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో మా కాజు ఎంత అందంగా ఉందో అంటూ పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఆ ఫోటోలు ఏవో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం.Kajal Aggarwal in Acharya movie Photo : Youtube