ప్రపంచంలో అనేక కులాలు మరియు మతాల ప్రజలు నివసిస్తున్నారు. భారతదేశంలో కూడా అనేక కులాల, తెగల ప్రజలు ఉన్నారు. వీరిలో చాలా మంది ఆధునికతను సంతరించుకుని టెక్నాలజీ తగ్గట్టుగా జీవిస్తున్నారు. కానీ ఇప్పటికీ రాతియుగంలా జీవిస్తున్న ఓ తెగ ఉంది. ఆ తెగ పేరు జార్వా. ఇది.. భారతదేశంలోని అండమాన్-నికోబార్ దీవులలో నివసిస్తున్న ఒక గిరిజన తెగ. వీళ్ల ఆచారాలు తెలిస్తే ఒళ్లు జలదరిస్తుంది.
జర్వా తెగలో మరికొన్ని వింత ఆచారాలు పాటిస్తారు. అందులో ఒకటి ఏంటంటే.. ఒక మహిళ అందంగా, తెల్లగా ఉన్న పాపకు జన్మనిస్తే.. ఆ బిడ్డను వెంటనే చంపేస్తారు. దానికి కారణం జర్వా తెగ ప్రజలు నల్లజాతీయులు. వీరి రంగు నలుపు. అప్పుడు తెల్లని చర్మం గల శిశువు మరొక తెగ లేదా సమాజానికి చెందినదనే భావనతో చంపబడుతుంది. ఈ తెగలో పాప పుడితే ఆ తెగలోని ఆడవాళ్ళందరూ తల్లిపాలు ఇస్తారు. సమాజం కలిసి ఉండేందుకు ఇది దోహదపడుతుందని ఆ తెగ నమ్ముతుంది.