Japan Snow : ప్రపంచంలోని అందమైన దేశాల్లో జపాన్ ఒకటి. ఆ దేశం ఒక్కో సీజన్లో ఒక్కోలా కనిపిస్తుంది. ఎండాకాలంలో చెర్రీ పూలతో భూలోక స్వర్గంలా కనిపిస్తుంది. చలికాలంలో మంచు కురుస్తూ మరో లోకాన్ని తలపిస్తుంది. అందుకు ఈ ఫొటోలే సాక్ష్యం. (image credit - instagram - ag.lr.88)
2/ 11
ఈ ఫొటో చూడండి. బహుశా ఇలాంటిది మీరు ఎప్పుడూ చూసి ఉండరు. ఓ పక్కన సముద్రం.. మరో పక్కన నేలపై పరచుకున్న మంచు. మధ్యలో ఇసుక తీరం. అలాంటి చోట నడుస్తూ వెళ్తుంటే.. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? (image credit - instagram - ag.lr.88)
3/ 11
జపాన్ ప్రజలు శుచి, శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. రోడ్లు, భవనాలు, చెట్లు అన్నీ అందంగా కనిపించేలా చేస్తారు. అందుకే మంచు కురిసినప్పుడు అక్కడి దృశ్యాలు ఆకట్టుకుంటాయి. (image credit - instagram - ag.lr.88)
4/ 11
మంచుతెరల జపాన్ అందాల్ని ఇన్‌స్టాగ్రామ్‌లోని ag.lr.88 పేజీలో చూపిస్తున్నారు. ఇప్పుడీ దృశ్యాలు వైరల్ అయ్యాయి. (image credit - instagram - ag.lr.88)
5/ 11
ఇండియాతో పోల్చితే జపాన్ చాలా చిన్నదేశం. అయినప్పటికీ అక్కడి ప్రజలు.. పార్కులు, సందర్శక ప్రదేశాలను బాగా అభివృద్ధి చేసుకున్నారు. (image credit - instagram - ag.lr.88)
6/ 11
రెండు అణుబాంబులను తట్టుకొని నిలబడిన జపాన్ ప్రజలు.. కష్టపడటం ద్వారానే ఫలితాలు వస్తాయని నమ్మారు. ఫలితంగానే ఆ దేశం అభివృద్ధిలో దూసుకెళ్లింది. (image credit - instagram - ag.lr.88)
7/ 11
జపాన్‌కి తరచూ భూకంపాలు, సునామీల సమస్య ఉంటుంది. ఎప్పుడు కాళ్ల కింద భూమి కంపిస్తుందో తెలియదు. అయినా అక్కడి ప్రజలు భవిష్యత్తుపై పాజిటివ్ ఆలోచనలతో జీవిస్తున్నారు. (image credit - instagram - ag.lr.88)
8/ 11
సహజంగానే జపాన్‌కి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారు. చలికాలంలో మరో లోకాన్ని చూసే ఫీల్ కోసం వస్తుంటారు. వారిని ఈ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. (image credit - instagram - ag.lr.88)
9/ 11
ప్రపంచ ఫొటోగ్రఫర్లకు జపాన్ బాగా నచ్చుతుంది. అక్కడి రాజసౌధాల ఆకృతులు ఫొటోల్లో బాగా కనిపిస్తాయి. వాటికి మంచు తెరలు కూడా తోడైతే.. మరింత అందం వస్తుంది. అందుకే ఇప్పుడు ఫొటోగ్రాఫర్లు తరలి వెళ్తున్నారు. (image credit - instagram - ag.lr.88)
10/ 11
జపాన్‌లో మంచు తెరలు (image credit - instagram - ag.lr.88)
11/ 11
జపాన్‌లో మంచు తెరలు (image credit - instagram - ag.lr.88)