ఇదివరకు యోగాసనాలకు ఔట్ డోర్‌కి వెళ్లేవారు. ఇప్పుడు కరోనా కారణంగా... ఇళ్లలోనే ఉంటూ యోగాసనాలు వేయాల్సి వస్తోంది. ఇంట్లోనే ఉంటూ.. వర్కింగ్ ఫ్రమ్ హోమ్ చెయ్యాల్సి వస్తోంది. మరి అలాంటి వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కి ప్రత్యేక యోగాసనాలు ఉన్నాయి. వాటి ద్వారా... శరీరాన్ని స్ప్రింగులా మార్చుకోవచ్చు. ఇందుకోసం బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లోనే వర్కవుట్ చెయ్యవచ్చు. ఇప్పటివరకూ యోగా ప్రాక్టీస్ చెయ్యకపోతే... ఈ ఆసనాల ద్వారా ఈ ప్రాక్టీస్ ప్రారంభించవచ్చు. ఇంట్లోనే ఉంటూ చేయడానికి చాలా యోగాసనాలు ఉన్నాయి. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అవేంటో తెలుసుకుందాం.
Seated arm raises : మీరు చైర్లో కూర్చొని ఉండి... రెండు చేతులూ పైకి గాల్లోకి ఎత్తండి. అలా ఐదు సెకండ్లు ఉంచండి. మీ ఎడమ అర చేతిని... కుడి చేతి మణికట్టు దగ్గర ఉంచండి. ఈసారి కుడి అర చేతిని ఎడమ చేతి మణికట్టు దగ్గర ఉంచండి. ఇలా 20 సార్లు చెయ్యండి. దీని వల్ల మీ చేతి కండరాలు ఫ్రీ అవుతాయి. చేతులపై ఒత్తిడి తగ్గుతుంది. కంప్యూటర్, మొబైల్ వాడకం వల్ల కలిగే ఒత్తిడి తగ్గుతుంది.
Calf raises : తిన్నగా నిల్చోండి. పాదాల వెనక భాగాన్ని పైకి లేపండి. ఇలా ఎక్కడ ఉండైనా చెయ్యవచ్చు. కాలి వేళ్లపై ఆధారపడి వీలైనంత ఎక్కువగా లేవండి. మూడు సెకండ్లు అలా ఉండండి. ఇప్పుడు పాదాన్ని మెల్లగా కిందకు దింపండి. ఇలా 30 సార్లు చెయ్యండి. ఫలితంగా మీ పాదాల కండరాలు ఫ్రీ అవుతాయి. దీని వల్ల ఒకేచోట కూర్చునేటప్పుడు పాదాలపై పడే ఒత్తిడి పోతుంది.
Eye focus exercises : కళ్లకు కూడా ఎక్సర్సైజ్ అవసరమే. ఎందుకంటే ఈ కంప్యూటర్లు, మొబైళ్లు కళ్లకు ఎంతో హాని చేస్తాయి. అందువల్ల కళ్లతో ఏం చెయ్యాలంటే... కంప్యూటర్ నుంచి వేరేవైపు చూస్తూ... 30 సెకండ్లు కళ్లను ఆడించాలి. ఇలా ఆఫీస్ షిఫ్ట్ టైమ్‌లో 10 సార్లు చెయ్యాలి. 50 అడుగుల దూరంలోని వస్తువును చూడాలి. ఓ ఐదుసార్లు కళ్లను మూసి, తెరవాలి. మీ అరచేతుల్ని రుద్దుకోవాలి. కాస్త వేడి వచ్చేలా చేసుకోవాలి. వెంటనే మీ కళ్లను ఆ చేతులతో కప్పాలి. అప్పుడు మీ కళ్లను 20 సెకండ్లు మూసి ఉంచాలి. ఇలా 5సార్లు చెయ్యాలి.