కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886, మే1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు. దానికి మద్దతుగా నాలుగు రోజుల తరవాత షికాగోలోని హే మార్కెట్లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు.(ప్రతీకాత్మక చిత్రం)
మానవుడు చక్రం కనిపెట్టడం నాగరికత మార్పునకు, కాల క్రమంలో పారిశ్రామికీకరణకు దారితీయగా, కార్ల్ మార్క్స్ శ్రమదోపిడీని నిర్వచించిన తర్వాత కార్మిక పోరాటాలు, హక్కుల స్పృహక్రమంగా పెరుగుతూ వచ్చాయి. ‘ప్రపంచ కార్మికులరా ఏకంకండి.. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప..’ అని ఎలుగెత్తి చాటాడు కార్ల్ మార్క్స్. (ప్రతీకాత్మక చిత్రం)
1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలూ, నిరసన ప్రదర్శనలూ చోటుచేసుకున్నాయి. నాటి అమరుల త్యాగానికి ప్రతీక ‘మే డే’. ఏటా మే 1వ తేదీన ‘ప్రపంచ కార్మికుల దినోత్సవం’ జరుపుకుంటున్నాం. కాలక్రమంలో ప్రపంచవ్యాప్తంగా మే డే స్వరూపం మారుతూ వచ్చింది. అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలూ, నిరసన ప్రదర్శనలూ చేపట్టడం పరిపాటైంది.(ప్రతీకాత్మక చిత్రం)