ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అయిన న్యూయార్క్ పిల్లి పాంజూ చనిపోయింది. ఈ పిల్లికి ప్రత్యేకంగా 47వేల మంది ఫాలోయర్లు ఉన్నారు. అలాంటి పిల్లి ఈ నెల మొదట్లో ఓ పిల్లాడు చేసిన పని వల్ల చనిపోయింది. ఆ పిల్లాడు పిల్లికి మెడలో ఉన్న తాడును అనుకోకుండా గట్టిగా లాగేశాడు. ఏప్రిల్ 4న ఈ ఘటన జరిగింది. దీనిపై పిల్లి ఓనర్... ఆ పిల్లాడి కుటుంబ సభ్యులతో గొడవపడ్డారు. అలాంటి పిల్లి గుండె సమస్యతో చనిపోయింది. (image credit - instagram - ponzucoolcat)
మూడేళ్ల పాంజు... ఓ చిలుక, కుక్క, మరో పిల్లితో స్నేహం చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఈ పిల్లికి ఫ్యాన్స్ అయిపోయారు చాలా మంది. దీని ఓనర్ 34 ఏళ్ల చానన్ అక్సోర్నన్... రెగ్యులర్‌గా కుక్క, పిల్లి, చిలుకను వాకింగ్ కోసం బయటకు తీసుకెళ్తుంటారు. తాజాగా బ్రూక్లిన్‌లోని ఓ పార్కులోకి తీసుకెళ్లినప్పుడు అక్కడో పిల్లాడు పిల్లికి మెడలో ఉన్న తాడును చూసుకోకుండా లాగేశాడు. దాంతో అది గాయాలపాలైంది. (image credit - instagram - ponzucoolcat)
పిల్లాడు చేసిన పనికి... అతని ఫ్యామిలీ సారీ చెబుతుంది అనుకుంటే... వాళ్లు రివర్సులో పిల్లి ఓనర్‌పై గొడవకు దిగారు. దాంతో ఆశ్చర్యపోవడం చానన్ వంతైంది. ఆ గొడవ ఎంతలా జరిగిందంటే... ముగ్గురు మహిళలు చానన్పై పిడిగుద్దులు గుద్దారు. చానన్ బాయ్ ఫ్రెండ్ పైనా దాడి చేశారు. (image credit - instagram - ponzucoolcat)