దేశంలోనే రైలులో అధిక శాతం ప్రజలు ప్రయాణిస్తారు. ప్రస్తుతం అనేక చోట్ల రైల్వే నెట్ వర్క్ అందుబాటులో ఉంది. కొండల ప్రాంతంలో కూడా అధికారులు రైల్వే లైన్ లను అందుబాటులోకి తెస్తున్నారు. రైల్వేలను సరుకు రవాణా కోసం, నిత్యవసారల వస్తువులను రవాణా కోసం అధికంగా ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా ఆయా రాష్ట్రల సరుకులు, వస్తువులు, ఆహార ధాన్యల రవాణా జరుగుతుంది.
ఎక్కువ మంది ప్రయాణికులు, దూర ప్రాంతాలకు జర్నీ చేయడానికి రైలు మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. దీనిలో అనేక వసతులు ఉండటం, నడవటానికి అనుకూలంగా ఉండటం వలన దీన్ని తమ జర్నీకి ఎంచుకుంటున్నారు. మనం రైళ్లలో ప్రయాణించేటప్పుడు.. బస్సులు, కార్లపై ఉండే మాదిరిగా కొన్ని ప్రత్యేక అంకెలు ఉంటాయి. వీటి వెనకాల కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఆ అంకెలు కొన్ని ప్రత్యేకతలను కల్గి ఉన్నాయి.
అదే విధంగా, చివరి మూడు అంకెలు 052 అనేది ఏసీ కోచ్ ల సమాచారం ఇస్తుంది. రైల్వేల సంఖ్య 1 నుంచి 200 వరకు ఏసీ కోచ్ లను సూచిస్తుంది. ఆ తర్వాత.. 200 నుంచి 400 అంకెలు స్లీపర్ కోచ్ లను సూచిస్తాయి. ఒక వేళ ఉదాహరణకు.. కోచ్ లో 98337 అంకె ఉంటే.. అది 1998 లో తయారు చేయబడిందని, 337 అంకె స్లీపర్ కోచ్ లను సూచిస్తుంది.
రైళ్లలో, ప్రయాణీకులందరికీ వసతి కల్పించడం సాధ్యం కానప్పుడు చైర్ కార్ కోచ్ ఎంపిక ఉపయోగించబడుతుంది. చైర్ కార్ కోచ్‌లో ప్రయాణించాలంటే ముందుగా బుక్ చేసుకోవాలి. 700-800 సంఖ్యలు సీటింగ్ మరియు లగేజ్ కంపార్ట్మెంట్లను సూచిస్తాయి. కోచ్ 2008లో నిర్మించబడిందని 08701 నంబర్ చూపుతుంది. అదే విధంగా 701 అంటే సీటింగ్, బ్యాగేజీ కోచ్ అని అర్థం.