గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏపీలో చలి తీవ్రత కాస్త పెరిగింది. కోస్తాంధ్ర, యానాంలో నేటి నుంచి మరో రెండు రోజుల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, యానాం (పుదుచ్చేరి), జిల్లాలలో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
తెలంగాణ వాతావరణం, తెలంగాణ వర్షాలు, తెలంగాణలో మరో 3 రోజులు వానలు, ఐఎండీ తాజా బులెటిన్" width="1600" height="1600" /> గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పొట్టి శ్రీరాములు జిల్లాలో నేడు సైతం తేలికపాటి జల్లులు కురవనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. ఆ మరుసటి రోజు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అత్యల్పంగా కళింగపట్నంలో 19.4 డిగ్రీలు, నందిగామలో 19.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జంగమేశ్వరపురంలో 19.8 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాయలసీమలో నేడు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రేపు కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. రాయలసీమలోని ఆరోగ్యవరంలో 19 డిగ్రీలు, నంద్యాలలో 20.6 డిగ్రీలు, కర్నూలులో 20.1 డిగ్రీలు, తిరుపతిలో 22 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాల నేపథ్యంలో చలి గాలులు వీస్తున్నాయి.