ఇక, లండన్ నుంచి భారత్లోని కొచ్చికి వచ్చే ఎయిర్ ఇండియా విమానంలో ఓ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. విమానంలో 210 మంది ప్రయాణిస్తుండగా.. వారిలో ఇద్దరు వైద్యులు, నలుగురు నర్సులు ఉన్నారు. వెంటనే వీరంతా ఆ మహిళకు వైద్యం మొదలుపెట్టారు. నెలలు నిండని ప్రసవాన్ని వారు సుఖాంతం చేశారు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ బిడ్డకు భారత దేశ పౌరసత్వం వస్తోందా? లేక ఇంగ్లండ్ పౌరసత్వం వస్తోందా..? విమానంలో ప్రసవాలకు సంబంధించి ఒక్కో దేశంలో ఒక్కోలా నిబంధనలు ఉన్నాయ్.
అయితే, తన తల్లితండ్రులకు ఏ దేశ పౌరసత్వం ఉందో.. అది తీసుకునే హక్కు ఆ బిడ్డకి ఉంది. ఉదాహరణకు.. ఇండియా బోర్డర్ లో ఉన్నప్పుడు బిడ్డకు జన్మనిస్తే.. ఆ చైల్డ్ కి భారత పౌరసత్వం దక్కుతోంది. అదే విధంగా తల్లిదండ్రుల పౌరసత్వం కూడా ఆ బిడ్డ తీసుకునే అవకాశం ఉంది. ఇలా రెండు దేశాల పౌరసత్వం తీసుకోవచ్చు. అయితే, భారత్ లో రెండు దేశాల పౌరసత్వానికి ఆమోదం లేదు.