మీ దగ్గర ఆ పాత పది రూపాయల నోటు గనక ఉన్నట్లైతే... మీరు రూ.25,000 పొందగలరు. ఎలాగంటే... ఈ రోజుల్లో కొంత మందికి న్యూమిస్మ్యాటిక్స్ అలవాటు ఉంది. అంటే... పాత నాణేలు, పాత కరెన్సీ నోట్లను సేకరించడం. వాళ్లకు అదో తృప్తి. ఎవరి దగ్గరా లేని పాతనోట్లు తమ దగ్గరే ఉన్నాయనే ఫీల్ వారికి ఎంతో ఆనందం కలిగిస్తుంది. అందుకోసం వారు ఎంత డబ్బైన ఖర్చు పెట్టి... పాత నోట్లు కొంటున్నారు. వారు ఇచ్చినదే ఈ ఆఫర్. (ప్రతీకాత్మక చిత్రం)
ఇదే కాదు... ఇలాంటి రకరకాల పాత నోట్లను కొన్ని వెబ్సైట్లు కొంటున్నాయి. అవి ఏవంటే... www.marudhararts.com, www.shopclues.com, అలాగే... https://coinbazzar.com ఈ సైట్లలోకి మీరు వెళ్తే... రకరకాల పాతనోట్లు... వాటిని ఎంతకు కొనేదీ, వాటికి ఉన్న కండీషన్లు ఏంటి అనేది మీకు తెలుస్తుంది. వాటిలో ఏదైనా నోటు మీ దగ్గర ఉంటే... మీ పంట పండినట్లే. (ప్రతీకాత్మక చిత్రం)
మీ దగ్గర అలాంటి నోటు ఉంటే... మీరు ఈ సైట్లలో రిజిస్టర్ అయ్యి... ఆ నోటు ఫొటోలను అప్లోడ్ చెయ్యాలి. వాటిని కొనుక్కోవాలి అనుకునేవారు... వాటి ఫొటోలను చూసి... కన్ఫామ్ చేస్తారు. దాంతో... ఆ నోటు వారికి ఇచ్చి మీరు మనీ పొందగలరు. ఇదంతా చాలా ఈజీగా జరిగే ప్రాసెస్. మరి ఓసారి ఆ సైట్లలోకి వెళ్లి... మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)