మనకు అప్పటికప్పుడు బిర్యానీ తినాలనిపిస్తుంది. కానీ ఆ రెస్టారెంట్ వరకు వెళ్లడానికి బద్దకం. వర్క్ బిజీలో చాయ్ తాగాని ఉంటుంది. కానీ అక్కడ వరకు వెళ్లే సమయం ఉండదు. వర్షం పడుతుంటే మంచి స్నాక్స్ తినాలనుకున్నా.. సాయంత్రం ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసే సమయంలో మంచి స్టఫ్ కావాలన్నీ ఇప్పుడు చాలా మంది బైక్ వేసుకొని రెస్టారెంట్లకు వెళ్లడం లేదు. చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లో అనేక ఫుడ్ డెలివరీ యాప్స్ ఉన్నాయి. వాటిలో అలా ఆర్డర్ ఇస్తే.. నిమిషాల్లో డెలివరీ బాయ్స్ మన ఇంటి తలుపు తడతారు. మనం కోరుకున్న ఫుడ్‌ను వేడివేడిగా అందిస్తారు. (facebook)
హైదరాబాద్ వంటి నగరంలో కూడా ఎంతో మంది ఫుడ్ డెలివరీ ఏజెంట్లుగా పని చేస్తున్నారు. డెలివరీ బాయ్స్‌గా ఉంటూ కుటుంబాన్ని పోషించుకునే వాళ్లు కొందరైతే.. ఇలా పని చేస్తూనే చదువుకునే వాళ్లు కూడా ఉన్నారు. చేస్తున్న చిన్నా చితకా పనుల్లో సరిపడే జీతం రాక పార్ట్ టైం జాబ్ లాగా చేసే వాళ్లు కూడా ఉన్నారు. నగరంలో ఎంతో మంది డెలివరీ బాయ్స్ నిత్యం వందలాది ఆర్డర్లను కస్టమర్లకు చేరవేస్తున్నారు. అలా ఫుడ్ డెలివరీ చేసే వారికి టిప్స్ ఇవ్వడమే ఎక్కువ అనుకుంటే.. ఇక్కడ ఒక ఫుడ్ గ్రూప్ ఏకంగా బైక్ కొని ఇవ్వడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాబిన్ ముఖేష్ కింగ్ కోటీలో ఉంటాడు. జూన్ 14 రాత్రి సమయంలో ఆయనకు రెడ్ హిల్స్‌లో ఉండే నీలోఫర్ కేఫ్ చాయ్ కావాలని ఆర్డర్ పెట్టాడు. అరగంటలో ఒక డెలివరీ బాయ్ అతడికి వేడి వేడి చాయ్ అందించాడు. అయితే ఆ ఆర్డర్ తెచ్చిన యువకుడు ఒక సైకిల్ మీద రావడం రాబిన్ గమనించాడు. వెంటనే అతడి వ్యక్తిగత వివరాలు కనుక్కున్నాడు. (facebook)
హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అకీల్ ఒక ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేస్తూనే జొమాటోలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. తన వద్ద బైక్ లేకపోవడంతో సైకిల్ మీదే డెలివరీలు అందిస్తున్నాడు. అకీల్ తండ్రి చెప్పులు కుట్టుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆ కుటుంబానికి అకీల్ సంపాదన కూడా ఆసరాగా ఉంటుంది. అయితే అతడికి బైక్ కొనుక్కునే స్థోమత లేదని అర్థమైన రాబిన్ ముఖేష్ ఏదైనా సహాయం చేయాలని భావించాడు. వెంటనే ఈ విషయాన్ని తాను సభ్యుడిగా ఉన్న 'ది గ్రేట్ హైదరాబాద్ ఫుడ్ అండ్ ట్రావెల్ క్లబ్' - ది ఫ్యాట్ క్లబ్.. లో పోస్ట్ చేశాడు. అకీల్కి ఒక బైక్ కొనిస్తే బాగుంటుంది. తాను ఒక్కడినే అంత పెద్ద మొత్తం సహాయం చేయలేను కాబట్టి క్రౌడ్ ఫండింగ్ చేద్దామని రిక్వెస్ట్ చేశాడు. నిమిషాల వ్యవధిలోనే 'ది ఫ్యాట్ క్లబ్' సభ్యులు ముఖేష్ రిక్వెస్ట్‌కు స్పందించారు. తామూ సహాయం చేస్తాం.. అకీల్‌కు ఏ బైక్ అంటే ఆ బైక్ కొనిద్దామంటూ ముందుకు వచ్చారు. (facebook)
ది ఫ్యాట్ క్లబ్ ఫౌండర్, అడ్మిన్ రవికాంత్ రెడ్డి కూడా ఇందుకు చేయూతనిచ్చారు. అదే సమయంలో అకీల్‌ను ఏ బైక్ కావాలని అడిగితే.. తనకు పెద్ద బైక్స్ ఏమీ వద్దని.. టీవీఎస్ ఎక్స్ఎల్ మోపెడ్ చాలని అన్నాడు. వెంటనే దాదాపు రూ. 70 వేల విలువ చేసే బైక్‌ను కేవలం మూడు రోజుల వ్యవధిలో క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించి అకీల్‌కు అందించారు. శుక్రవారం టీవీఎస్ షోరూంకు వెళ్లిన రవికాంత్ రెడ్డి, రాబిన్ ముఖేష్.. అకీల్‌కు బౌక్తో పాటు హెల్మెట్, రెయిన్ కోట్, మాస్క్‌ల ప్యాకెట్, శానిటైజర్స్ అందించారు. ఆ బైక్ తాళం చెవి అందిస్తున్న సమయంలో అకీల్ నవ్వును చూసిన ది ఫ్యాట్ క్లబ్ సభ్యుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. (facebook)
ఈ రోజుల్లో పది రూపాయల టిప్ ఇవ్వడానికే వెనకడుగు వేస్తూ.. డెలివరీ బాయ్స్ పట్ల దురుసుగా ప్రవర్తించే వాళ్లు ఉన్నారు. కానీ తనకు టీ డెలివరీ చేసిన కుర్రాడి కష్టం తెలుసుకొని.. ఒక ఫుడ్ గ్రూప్ అండతో పెద్ద సహాయం చేయడం అంటే నిజంగా గ్రేట్. అందుకే అనాలనిపిస్తుంది.. మానవత్వం ఇంకా బతికే ఉంది బ్రదర్ అని. (facebook)
ది గ్రేట్ హైదరాబాద్ ఫుడ్ అండ్ అండ్ ట్రావెల్ క్లబ్ గ్రూప్‌ను 2019లో రవికాంత్ రెడ్డి స్థాపించారు. ఇందులో 30 వేలకు మందిపైగా సభ్యులు ఉన్నారు. కేవలం ఆహారానికి సంబంధించిన రివ్యూలు, రెస్టారెంట్ల వివరాలు మాత్రమే కాకుండా ట్రావెల్. ఇతర విషయాలను కూడా ఈ గ్రూప్‌లో షేర్ చేస్తుంటారు. ఈ గ్రూప్ సభ్యులకు హైదరాబాద్ రెస్టారెంట్లలో అప్పుడప్పుడు ఆఫర్లు కూడా లభిస్తుంటాయి. మీరూ చేరాలనుకుంటే ఫేస్బుక్లో 'The Great Hyderabad Food and Travel Club' అని టైప్ చేసి సెర్చ్ చేయండి. (facebook)