ఇదిలా ఉంటే రెండు నెలలపాటు టమాటా ధరలు ఆకాశంలోనే విహరిస్తాయని, జనవరి తర్వాతగానీ టమాటా ధరలు కొద్దిగా దిగివస్తాయని క్రిసిల్ ఆధారాలతో కూడిన అంచనాలు వేసింది. మరోవైపు, టమాటా అధిక ధరలపై కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. ఈ ఏడాది ఎంత శాతం ధర పెరిగిందో చెబుతూ, దాన్ని కిందికి దించడానికి చేపట్టిన చర్యలను కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. (ప్రతీకాత్మకచిత్రం)