ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ..ఖడక్పూరా గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన కొత్తగా పెళ్లైన మహిళలు ఈ ఆలయాన్ని తప్పని సరిగా దర్శించుకుంటారు. ఈ అమ్మవారి దర్శించుకోవడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని స్థానికులు నమ్ముతారు. అంతే కాదు ఖడక్పూర గ్రామంలో బిడ్డల్లేని మహిళలు ఒక్కరు కూడా లేరని స్థానికులు చెబుతున్నారు. ఇది అమ్మవారి దయేనంటున్నారు. ఊరి మధ్యలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గర ఫోటోలు తీసుకోవడం, సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు ఆసక్తిచూపుతున్నారు.
నవరాత్రి పర్వదినం రోజున చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఇక్కడ భక్తులు కోరుకునే కోర్కెలు అమ్మవారు తీరుస్తుందని ప్రజలు చెబుతారు. ఈవిషయంలో గ్రామానికి చెందిన వాళ్లే కాదు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా వస్తుంటారు.