iconic characters: ఇటీవల కాలంలో విడుదలైన సినిమాలలో కొన్ని లేడీ క్యారెక్టర్స్ చాలా పవర్ ఫుల్. ఆ పవర్ ఫుల్ క్యారెక్టర్స్ వల్లే కొన్ని సినిమాలు మాములు హిట్ కావాల్సినవి సూపర్ హిట్ అవుతున్నాయ్. అలా రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో సూపర్ హిట్ అయిన లేడీ క్యారెక్టర్స్ క్రాక్ లో జయమ్మ, జాతిరత్నాలు లో చిట్టి పాత్ర. ఒకరిది విలనిజం, ఒకరిది కామెడీ... కానీ భారీస్థాయిలో స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. అలా 1990 నుంచి ఇప్పటివరకు లేడీ క్యారెక్టర్స్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
నీలాంబరి.. నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రలో నటించిన రమ్య కృష్ణ అప్పటి వరకు హీరోయిన్ పాత్ర, రొమాంటిక్ పాత్రల్లో నటించిన రమ్యకృష్ణ.. ఒక్కసారిగా విలన్ గా కనిపించి రజినీకాంత్ కు పోటీగా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది ఈ పవర్ ఫుల్ బ్యూటీ. ఆతర్వాత ఎన్నో ఏళ్లకు బాహుబలిలో శివగామి పాత్ర పోషించింది నీలాంబరి.