చామరాజనగర్: పెళ్లిళ్ల సీజన్ మళ్లీ మొదలు కాబోతోంది. ఫిబ్రవరిలో అడపాదడపా ముహూర్తాలు ఉన్నప్పటికీ మార్చి నుంచి ముహూర్తాలు బాగానే ఉండటంతో చాలా జంటలు పెళ్లికి సిద్ధమవుతున్నాయి. అయితే.. భారత్‌లో కరోనా థర్డ్‌వేవ్ మొదలవడం, రోజుకు 3 లక్షల పైచిలుకు కొత్త కేసులు నమోదవుతుండటంతో పెళ్లిళ్ల వంటి శుభకార్యాలను పరిమిత అతిథుల సమక్షంలో జరుపుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
కానీ.. కరోనా థర్డ్ వేవ్ మొదలు కావడం, కొత్త కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రభుత్వం శుభకార్యాలకు హాజరయ్యే అతిథుల విషయంలో నిబంధనలు విధించింది. దీంతో.. తొలుత పెళ్లిని వాయిదా వేసుకుందామని భావించినప్పటికీ వధూవరులిద్దరూ వాయిదా వేయాల్సిన అవసరం లేదని ఇరు కుటుంబాలకు చెప్పాయి. సుష్మా, శ్రేయాస్ ఇద్దరూ కలిసి మళ్లీ కొత్తగా వెడ్డింగ్ కార్డులు ప్రింట్ చేయించారు. గతంలో పంపిన అతిథులందరికీ ఆ కార్డులను పంపారు.
ఎవరికి కరోనా ఉందో, లేదో తెలియకుండా ఉన్న ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పెళ్లి చేసుకుని వైరస్‌కు వ్యాప్తి చెందే అవకాశం ఇచ్చే కంటే.. ఇలా పరిమిత సంఖ్యలో కోవిడ్-19 ప్రొటోకాల్‌ను పాటిస్తూ పెళ్లి చేసుకున్న ఈ జంటకు అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ.. నిండు నూరేళ్ల పాటు చల్లగా ఉండాలని మనస్పూర్తిగా మీరూ ఆశీర్వదించండి.