ఫాదర్స్ డే అనగానే... ప్రపంచం మొత్తం తండ్రి గొప్పదనాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. పిల్లల ఎదుగుదల కోసం తండ్రి చేసే త్యాగాల్ని స్మరించుకుంటుంది. ఐతే... తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే పిల్లలు సంతోషంగా ఉండగలరు. అందువల్ల ఏజ్ పెరుగుతున్న కొద్దీ... ఆరోగ్యంపై శ్రద్ధను కూడా పెంచుకోవాలి. బాధ్యతలు ఎక్కువవుతున్నా... హెల్త్ని మర్చిపోకూడదు.
అమెరికా హార్ట్ అసోసియేషన్ ప్రకారం... తండ్రులు 10 రకాల అంశాలపై శ్రద్ధ తగ్గిస్తారు. అందువల్ల అవి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. అవి గుండె సమస్యలు, కాన్సర్, అనుకోకుండా జరిగే గాయాలు, గుండె నొపపి, శ్వాస సమస్యలు, డయాబెటిస్, సూసైడ్, నిమోనియా, అల్జీమర్స్ (మతిమరపు), కాలేయ సమస్యలు. వీటిని నిర్లక్ష్యం చేస్తే తగ్గకుండా మరింత పెరుగుతాయి. పొట్ట చుట్టూ కొవ్వు ఉంటే... పొట్ట యాపిల్లా ముందుకి వస్తే... అలాంటి వారికి గుండె పోటు, డయాబెటిస్, కాన్సర్, హాట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఫాదర్స్ డే నాడు తండ్రులు పాటించాల్సిన ఆరు ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం.
6. Get Regular Checkups : రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా బీపీ, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. అవి ఎక్కువగా ఉంటే... గుండె జబ్బులకు దారితీస్తాయి. హైబీపీ వల్ల సంతాన సమస్యలు కూడా వస్తాయి. అందువల్ల ముందుగానే అనారోగ్యాలపై ఓ కన్నేసి ఉంచితే... అవి దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చు.