విదేశాల్లో వ్యాపారం మానేసి.. గుజరాత్.. బనస్కాంత జిల్లాలో సేంద్రియ వ్యవసాయం ప్రారంభించాడు ఓ స్థానిక యువకుడు. ఇప్పుడు అతని వ్యవసాయంపై విదేశాల్లో కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా మంచి ఆదాయం వస్తోంది. విదేశాల్లో వ్యాపారాన్ని వదిలేసి పుట్టిన భూమిలో ఇలా ఎందుకు వ్యవసాయం చేస్తున్నాడో తెలుసుకుందాం.