Photos : జామపండుతో తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను రుచి చూసే "జామ మహోత్సవ్"కి ప్రజలు తరలివచ్చారు. జామ జిలేబీ, జామ రసగుల్లా, జామ హల్వా, జామ బర్ఫీ ఈ పండుగలో ఆకర్షణగా నిలిచాయి. ఫోటోల్లో ఆ రుచికరమైన వంటకాలను చూడండి.
జిలేబీ, రసగుల్లా పేర్లు వింటే చాలు ప్రతి ఒక్కరికీ నోరూరుతుంది. మరి జామపండుతో చేసిన జిలేబీ లేదా రసగుల్లా ఎప్పుడైనా తిన్నారా. అటువంటి ప్రత్యేకమైన స్వీట్ డిష్‌ని ఉత్తరప్రదేశ్ ప్రజలు టేస్ట్ చూశారు.
2/ 6
ప్రయాగ్‌రాజ్‌లో ఈ జామ మహోత్సవం జరిగింది. ఇదేదో కొత్తగా ఉందే.. అనుకుంటూ ఆహార ప్రియులు గుంపులు అక్కడికి వెళ్లారు.
3/ 6
ఖుస్రోబాగ్లో ఏర్పాటు చేసిన జామ పండుగలో జామ జిలేబీ, జామ జామూన్స్ ఆకర్షణీయంగా నిలిచాయి.
4/ 6
ఉద్యానవన శాఖ అధ్వర్యంలో నిర్వహించిన ఈ పండుగలో జామతో చేసిన రకరకాల స్వీట్లను ప్రదర్శించారు.
5/ 6
వీటిలో జామ పాయసం, జామ బర్ఫీ, జామ హల్వా కూడా ఉన్నాయి. జామతో ఇన్ని రకాల స్వీట్లు చెయ్యవచ్చని మొదటిసారి తెలిసిందని స్థానికులు చెబుతున్నారు.
6/ 6
స్వీట్లే కాకుండా.. విభిన్న, రుచికరమైన జామ జాతుల మొక్కలను కూడా ఇక్కడ ప్రదర్శించారు.