GOLD TOILET WORTH RS 9 CRORES EXHIBITED BY HONG KONG JEWELLER AARON SHUM AT CHINA INTERNATIONAL IMPORT EXPO SS
Gold Toilet: బంగారంతో టాయిలెట్... ధర రూ.9 కోట్లు... చూస్తే షాకే
వేలు, లక్షలు కాదు... కోట్ల రూపాయల టాయిలెట్ ఎప్పుడైనా చూశారా? హాంకాంగ్‌కు చెందిన ఓ వ్యాపారి గిన్నీస్ రికార్డు కోసం అంత ఖర్చుతో గోల్డ్ టాయిలెట్ తయారు చేయించారు. ఎలా ఉందో చూడండి.
1. ఇదే బంగారంతో తయారు చేసిన టాయిలెట్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాయిలెట్ ఇదే కావొచ్చు. దీని ధర రూ.9 కోట్లు. (image: Aaron Shum)
2/ 9
2. హాంకాంగ్ నగల వ్యాపారి ఆరోన్ షుమ్ ఈ టాయిలెట్‌ను తయారు చేయించారు. షాంఘాయ్‌లో చైనా ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ ఎక్స్‌పోలో గోల్డ్ టాయిలెట్‌ను ప్రదర్శించారు. (image: Aaron Shum)
3/ 9
3. బంగారం మాత్రమే కాదు మొత్తం 334.68 క్యారెట్ల విలువైన 40,815 వజ్రాలను ఈ టాయిలెట్ తయారీకి ఉపయోగించారు. (image: Aaron Shum)
4/ 9
4. ఇక ఈ లగ్జరీ టాయిలెట్‌కు మరో ప్రత్యేకత ఉంది. ఈ టాయిలెట్‌పై మూతను బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌తో తయారు చేయడం విశేషం. (image: Aaron Shum)
5/ 9
5. బంగారం, వజ్రాలతో తయారుచేసిన ఈ టాయిలెట్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. (image: Aaron Shum)
6/ 9
6. గోల్డ్ టాయిలెట్‌తో పాటు వజ్రాలతో తయారు చేసిన గిటార్, పింక్ డైమండ్స్‌తో తయారు చేసిన హీల్స్ కూడా తయారు చేయించారు సదరు నగల వ్యాపారి. (image: People's Daily, China)
7/ 9
7. గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కడం ఆరోన్ షుమ్కు ఇది కొత్తేమీ కాదు. 10 సార్లు గిన్నీస్ రికార్డు సాధించిన ఘనత ఆయనది. (image: Aaron Shum)
8/ 9
8. డైమండ్ ఆర్ట్ మ్యూజియం నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు ఆరోన్ షుమ్. (image: Aaron Shum)
9/ 9
9. ఆరోన్ షుమ్ కోరోనెట్ బ్రాండ్ పేరుతో నగలు, డైమండ్ వాచ్‌లు, సన్‌గ్లాసెస్ లాంటివి తయారు చేస్తున్నారు. (image: Aaron Shum)