Home » photogallery » trending »

FROM POLITICIANS TO MOVIE STARS WOMEN ARE SHARING THEIR FAVOURITE SAREE PHOTOS ON TWITTER BS

#SareeTwitter: చీర అందం.. భారతీయ సంస్కృతికి మకరందం.. నెట్టింట్లో విలసిల్లుతోందిలా..

చీర అనగానే టక్కున గుర్తొచ్చేది.. భారతీయ సంస్కృతి. అందాన్ని అమాంతం పెంచేసే అద్భుత వస్త్రం అది. జీన్స్ వచ్చినా, మిడ్డీలు ట్రెండ్ అవుతున్నా, పాశ్చాత్య దుస్తులు దండయాత్ర చేస్తున్నా.. చీర ముందు తాళలేవు. ఎంతమంది పాశ్చాత్య దుస్తులు ధరించి నిలుచున్నా.. చీర కట్టుకున్న ఒక్క అమ్మాయి కనిపిస్తే అందరిచూపు అటే మరలుతుంది. అదీ దాని గొప్పదనం.. ఇప్పుడు దాని గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతున్నారు ప్రముఖ మహిళలు. #SareeTwitter పేరుతో ట్విట్టర్ పిట్ట ప్రపంచమంతా ఊపు ఊపుతోంది.