ఇళ్లు లేవు, రోడ్లు లేవు, తిండి, నీరు లేదు, పొలాలు లేవు, స్థలాలు లేవు, కనీసం నిల్చోడానికి కూడా కాసింత జాగా లేదు. ఎటు చూసినా నీరే. ఎంత దూరం వెళ్లినా వరదలే. అసోం, బీహార్ ఇప్పుడు సముద్రంలా మారాయి. లక్షల మంది నీళ్లలోనే ఉన్నారు. ఎటు వెళ్లాలో తెలియక కాస్త ఎత్తుగా ఉండే భవనాల పైకి ఎక్కి దేవుడే దిక్కంటూ ఆకాశంవైపు చూస్తున్నారు.