ఇప్పుడు మనం టూరిజం ప్లేస్‌కి వెళ్లాలంటే.. భూమిపై ఉన్న ఏదో ఒక ప్రదేశానికి వెళ్తాం కదా.. భవిష్యత్తులో అలా కాదు. సముద్ర నగరాలకు కూడా వెళ్లొచ్చు. అక్కడ రకరకాల నగరాలు.. నీటిపై తేలుతూ తిరుగుతూ ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి కొన్ని ప్రాజెక్టులు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు మరొకటి వచ్చింది. ఇది బాగా ఆకట్టుకుంటోంది. కారణం ఈ నగరం ప్లాన్ తాబేలు ఆకారంలో ఉండటమే. (image credit - instagram - pierpaololazzarini)
ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణంలో లజ్జారినీకి మంచి గుర్తింపు ఉంది. ఈ సంస్థ ఇప్పటికే సముద్రంపై తిరిగే చాలా ఆధునిక బోట్లను తయారుచేసింది. 2033 లో తాబేలు నిర్మాణం మొదలై.. 8 ఏళ్లలో పూర్తవుతుందని భావిస్తోంది. దీని ద్వారా 60 వేల మంది సముద్ర నీటిపై జీవించవచ్చని చెబుతోంది. (image credit - instagram - pierpaololazzarini)