ఆమె పేరు అనిత ప్రభ. మధ్యప్రదేశ్ రాష్ట్రం అనుప్పుర్ జిల్లా కోట్మా అనే గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు అనితను కేవలం ఇంటర్ వరకు మాత్రమే చదివించగలిగారు. దీంతో ఆమెకు 17వ ఏటే పెళ్లి చేశారు. ఆమె భర్త ఆమె కన్నా 10 ఏళ్లు పెద్ద. అయినా అత్తింట్లో అనిత ఎప్పుడూ అందరితో సరిగ్గానే మెలిగేది.
రెండో సారి మళ్లీ పరీక్ష రాసి అందులో పాసై, దేహదారుఢ్య పరీక్షల్లోనూ సక్సెస్ అయింది. ఆ తరువాత పోలీస్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టింది. అనంతరం మధ్యప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి మొదటి ప్రయత్నంలోనే 17వ ర్యాంక్ సాధించింది. ఈ క్రమంలో ఆమెకు డీఎస్పీ పోస్టింగ్ లభించింది.