సానియా మీర్జా.. ఈ పేరు వింటేనే టెన్నిస్ ప్రపంచంలో ఆమె నమోదు చేసిన రికార్డులు గుర్తుకొస్తాయి. భారతదేశ టెన్నిస్ చరిత్రను తిరగరాసిన ఓ అత్యుత్తమ క్రీడాకారిణి గుర్తుకొస్తుంది.
2/ 8
సింగిల్స్‌తో కెరీర్ ప్రారంభించినా.. ఆ తర్వాత డబుల్స్‌లో కూడా రాణించి ప్రపంచ 'నెంబర్ 1'గా ఎదిగింది. 2005లో టైమ్ పత్రిక "50 హీరోస్ ఆఫ్ ఆసియా" అనే ఒక జాబితాను ప్రకటిస్తే.. అందులో స్థానం సంపాదించుకున్న అమ్మాయిగా అందరినీ ఆశ్చర్యపరిచిన.. ఓ రియల్ స్పోర్ట్స్ ఉమన్ గుర్తుకొస్తుంది.
3/ 8
1986 నవంబరు 15 తేదిన మహారాష్ట్రలోని ముంబయి ప్రాంతంలో పుట్టిన సానియా మీర్జా.. ఆరవ ఏటనే టెన్నిస్ ఆడడం ప్రారంభించిన సానియాకి తొలి గురువు ఆమె తండ్రే.
4/ 8
సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఓ బిల్డర్. తల్లి నసీమా ప్రింటింగ్ బిజినెస్ చేసేవారు. తన మీద తన తండ్రి ప్రభావం ఎంతగానో ఉండేది.
5/ 8
తాను చిన్నప్పుడు క్రీడల్లో రాణించడానికి అన్ని విధాలుగా సహాయపడిన తండ్రికి.. ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతూ ఉంటుంది సానియా.
6/ 8
సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఓ సందర్భంలో ఇలా అన్నారు. ఆరేళ్ల వయస్సులో సానియా రాకెట్ పట్టుకున్నప్పుడు తాను క్రీడా ప్రపంచంలో పెద్ద స్టార్ అవుతానని, కానీ ప్రపంచ వ్యాప్తంగా తనకో ప్రత్యేక గుర్తింపు లభించింది.
7/ 8
కానీ సానియా మీర్జా ఓ సూపర్ స్టార్. 125 ఏళ్లలో చరిత్రలో టాప్ టెన్నిస్ క్రీడాకారుల సరసన స్థానం సంపాదించిన మొట్టమొదటి మహిళ సానియా .. అంటూ గర్వంగా చెబ్తూ మురిసిపోతారు ఇమ్రాన్.
8/ 8
ఇప్పుడు దేశంలోని అమ్మాయిలంతా సానియాను చూసిన తర్వాత YES, I too can do it అనేంత ధైర్యాన్ని తెచ్చుకున్నారని చెప్పొచ్చు అంటారు ఇమ్రాన్.