Fathers Day 2021 : చూస్తుండగానే ఫాదర్స్ డే వచ్చేసిట్లైంది. మరి మనల్ని పెంచి, పెద్దచేసిన తండ్రికి ఏ గిఫ్ట్ ఇవ్వాలి? అందరిలాగా ఏ వస్తువో, వాచీయో కొని ఇస్తే... అది కొన్నాళ్లు పనిచేస్తుంది. ఆ తర్వాత... మూలన పడుతుంది. నిజానికి మన పెద్దవాళ్లకు అలాంటి వస్తువులు, వాచీల వంటి వాటిపై ఆసక్తి ఉండదు. వాళ్లు... తమ భవిష్యత్తుపై ఒకింత చింతతో ఉంటారు. వయసు పెరుగుతూ ఉంటే... రేపేంటి అన్న ఆలోచన వారిలో పెరుగుతూ ఉంటుంది. అందువల్ల వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించాలి. వారికి మానసిక ఒత్తిళ్లను మనం దూరం చెయ్యాలి. మరి అలాంటి గిఫ్టులేంటో తెలుసుకుందామా.
Fitness Class at Home : మన పేరెంట్స్‌కి ఫిట్నెస్ క్లాస్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. వయసు పెరిగేకొద్దీ ఫిట్నెస్ పెంచుకోవాలి కాబట్టి... ఇలాంటి వాటిలో చేర్పించితే మంచిదే. ఐతే... కరోనా కాబట్టి... ఆన్లైన్ ఫిట్నెస్ క్లాసుల్లో చేర్పించడం సరైన గిఫ్ట్ అవుతుంది. ఆన్లైన్ యోగా, జుంబా, ఏరోబిక్స్ ఇలా తండ్రికి ఏది నచ్చితే అది ఇచ్చేయడమే.
Body Check-ups : మన దేశంలో వయసు పెరిగినా చాలా మంది బాడీ చెకప్స్ చేయించుకోరు. ఎక్కడ మనీ అయిపోతుందో అని సందేహిస్తారు. ఐతే... రాబోయే అనారోగ్య సమస్యల్ని బాడీ చెకప్స్ ద్వారా ముందే కనిపెట్టవచ్చు. అందువల్ల పేరెంట్స్‌కి బాడీ చెకప్స్ చేయిస్తే... ఫాదర్స్ డే నాడు సరైన గిఫ్ట్ ఇచ్చినట్లవుతుంది. సరైన ఆరోగ్య నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది.
Healthy Diet Plan : మనం ఎన్ని తినమన్నా... మన పేరెంట్స్ ఆకలి లేదనో, తింటానులే అనో వాయిదా వేస్తుంటారు. మనం వాళ్లను మోటివేట్ చేసి... మంచి ఆహారం తినేలా... సరైన డైట్ పాటించేలా చెయ్యాలి. దాని వల్ల వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు. అదీ మనం ఇస్తున్న గిఫ్ట్ లాంటిదే. బ్రేక్ ఫాస్ట్ నుంచి బెడ్ వరకూ... మనం సరైన డైట్ వాళ్లకు సూచించాలి.
Memorable retirement : చాలా మంది పేరెంట్స్... సెక్యూర్ రిటైర్మెంట్ కోరుకుంటారు. కానీ అందుకు ఏం చెయ్యాలో సరైన ప్లాన్ వారి దగ్గర ఉండదు. ఫాదర్స్ డే నాడు మనం అభిప్రాయాలు తెలుసుకొని... సరైన రిటైర్మెంట్ ప్లాన్ సూచించాలి. ఫాదర్ ఏమనుకుంటున్నారో తెలుసుకొని... అందుకు తగిన ప్లాన్ మనం చెబితే... అదీ మంచి గిఫ్టే.
Health Insurance Plans : ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ కామన్. ఒకవేళ తండ్రికో, మనకో లైఫ్ ఇన్సూరెన్స్ లేకపోతే... అలాంటి పాలసీలు తీసుకోవడం మంచిదే. ఒక వేళ జరగరానిది జరిగితే... ఇన్సూరెన్స్ అమౌంట్... పెద్దవాళ్లను అదుకుంటుంది. మనం తీసుకునే లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్లకు ఓ లైఫ్ లాంగ్ గిఫ్ట్ అనుకోవచ్చు. అలాగే... పేరెంట్స్‌కి తీసుకునే ఇన్సూరెన్స్ వల్ల సడెన్‌గా అనారోగ్య సమస్యలేవైనా వస్తే... ఆ ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అదీ మంచి గిఫ్టే.