ఈ ఎలక్ట్రిక్ బైక్ బాగుంది కదా. అచ్చం కంపెనీలు తయారుచేసినట్లుగానే చాలా స్టైలిష్‌గా ఉంది కదా. దీన్ని తుక్కుతో తయారుచేశారంటే నమ్మడం కష్టమే కదా. మహారాష్ట్ర.. కరంజా పట్టణానికి చెందిన రహీమ్‌ఖాన్ చిన్న కొడుకు షఫిన్ఖాన్ ఇంటికి దూరంగా ఉన్న కాలేజీకి నడుస్తూ వెళ్లేవాడు. అతని స్నేహితులు మాత్రం వివిధ కంపెనీల ఖరీదైన బైక్‌లపై కాలేజీకి వెళ్లేవారు. ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పిన షఫిన్.. తనకు బైక్ లేదని బాధపడ్డాడు.
బైక్ తయారు చెయ్యాలంటే హ్యాండిల్, షాక్బ్స్, టైర్లు, ఇతర సామాగ్రిని జంక్ షాపులో చాలా తక్కువ ధరకు కొన్నాడు రహీమ్. అలాగే 24 వోల్ట్ల బ్యాటరీ, 24 వోల్ట్ల మోటార్‌ను కొని బాడీకి అమర్చాడు. పిల్లలు వాడిన పాత సైకిల్ ఇంట్లో పడి ఉంది. దాన్ని వాడుకున్నాడు. స్వతహాగా ఎలక్ట్రీషియన్ కావడంతో అన్ని సర్క్యూట్లను సరిగ్గా కనెక్ట్ చేసి స్క్రాప్ మెటీరియల్‌తో ఈ-బైక్‌ని తయారుచేశాడు.
ఈ బైక్‌కి స్పీడోమీటర్, హెడ్‌లైట్, సైడ్ ఇండికేటర్, కలరింగ్ కూడా సెట్ చేశాడు. స్క్రాప్ మెటీరియల్స్‌తో ఈ బైక్‌ను తయారు చేయడానికి రహీమ్‌ఖాన్‌కు 2 నెలల సమయం పట్టింది. దీని తయారీకి సుమారు 18 నుంచి 19 వేల రూపాయలు ఖర్చైంది. ఇప్పుడు ఈ బైక్ 50 నుంచి 60 కేజీల బరువుతో గంటకు 15 నుండి 20 కిలోమీటర్ల వేగంతో రోడ్డుపై పరుగులు తీస్తోది. షఫిన్ ఖాన్ రోజూ ఈ అద్భుతమైన ఎలక్ట్రిక్ బైక్‌పై కాలేజీకి వెళ్తున్నాడు.