ఓ డేటింగ్ యాప్ భారతీయుల గుట్టు రట్టు చేసింది. భారతీయులు ఎక్కువగా డేటింగ్‌కి ఆసక్తి చూపిస్తున్నారని తెలిపింది. తమ యూజర్లలో 20 శాతం మంది భారతీయులే అని తెలిపింది. ఫ్రాన్స్‌కి సంబంధించిన వివాహేతర సంబంధాల యాప్ గ్లీడెన్ (Gleeden).. తమకు కోటి మంది యూజర్లను పొందినట్లు తెలిపింది. వారిలో 20 శాతం మంది భారతీయులే అని చెప్పింది. అంటే.. 20 లక్షల మంది భారత్ నుంచి ఉన్నారన్నమాట. అలా ఉంది ఇండియన్లలో కొందరి పరిస్థితి.
గ్లీడెన్లోని భారతీయ వినియోగదారుల్లో ఎక్కువ మంది అధిక సామాజిక - ఆర్థిక బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చినవారేనని తెలిపింది. అంటే భారతీయుల్లో సంపన్నులే ఎక్కువగా ఈ యాప్ వాడుతున్నారన్నమాట. వృత్తుల గురించి మాట్లాడుతూ.. మగవాళ్లూ, మహిళలు ఇద్దరూ.. ఇంజనీర్లు, వ్యవస్థాపకులు, కన్సల్టెంట్లు, మేనేజర్లు, అధికారులు, డాక్టర్లు వంటి వారు అని తెలిపింది.