కొన్ని రోజులుగా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రతిరోజు భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రత వలన ప్రధానంగా కళ్లు ఇన్ఫెక్షన్లకు గురౌతాయి.
2/ 6
గాలిలో ప్రస్తుతం అధిక మొత్తంలో కాలుష్య కారకాలు ఉంటున్నాయి. దీంతో కళ్లలో దురద, కళ్లు ఎర్రబారడం, మండటం సంభవిస్తుంది.
3/ 6
ఎండలో బయటకు వెళ్లేటప్పుడు టోపీలు, స్కార్ఫ్ లతో పాటు, కూలింగ్ గ్లాసుల కూడా తప్పనిసరి వేసుకుని వెళ్లాలి. దీనితో కొంత వరకు వేడి కిరణాలు మన కంటి మీద నేరుగా పడకుండా ఉంటాయి.
4/ 6
దీంతో కండ్లకలక, కళ్లు ఎర్రగా మారటం తదితర ఇబ్బందులు సంభవిస్తాయి. ఎండను అశ్రద్ధ చేస్తే.. కంటి చూపు కూడా పోయే ప్రమాదం ఉందని కంటి నిపుణులు హెచ్చరిస్తున్నారు.
5/ 6
కళ్లమీద కాంటాక్ట్ లెన్స్ ఉన్న వారు పొరలు పెట్టుకొవడం, కంటి అద్దాలు వాడటం చేయాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా కూలింగ్ గ్లాసులు వేసుకొవాలి.
6/ 6
అధిక ఉష్ణోగ్రతల వలన కళ్లలోని కన్నీటి పొర ఆవిరైపోతుంది. దీంతో కళ్లు పొడిబారతాయి. దీంతో అలెర్జీలు ఏర్పడతాయి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు కూలింగ్ గ్లాసుల కూడా తప్పనిసరి వేసుకుని వెళ్లాలి.