Earth at Perihelion 2023 : సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయని మనకు తెలుసు. భూమి సూర్యుడి చుట్టూ గుండ్రంగా కాకుండా.. దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతోంది. అందువల్ల ఒక్కోసారి సూర్యుడికి చాలా దూరంగా వెళ్తుంది. ఒక్కోసారి సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్తుంది. భారత కాలమానం ప్రకారం... జనవరి 4 రాత్రి 9 గంటల 44 నిమిషాలకు భూమి.. సూర్యుడికి దగ్గరగా వెళ్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
పెరిహెలియన్ : సూర్యుడికి దగ్గరగా భూమి వెళ్లినా... అది భూ వాతావరణ పరిస్థితులపై ఎలాంటి ప్రభావమూ చూపదని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూమి దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ ఇవాళ 0.98329 డిగ్రీల్లో సూర్యునికి అత్యంత సమీపానికి వస్తోంది. ఆ సమయంలో సూర్యుడి నుంచి భూమి 14,70,98,928 కి.మీ దూరంలో ఉంటుంది. దీన్నే సైన్స్ ప్రకారం పెరిహెలియన్ (perihelion) అంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఉష్ణోగ్రతలు, రుతువులపై ప్రభావితం ఉంటుందా? : భూమి.. సూర్యుడి దగ్గరగా రావడం అనేది ఏటా జరుగుతుంది. అయినప్పటికీ భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత పెరగదు. అలాగే రుతువులపై కూడా ప్రభావం చూపదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సాధారణంగా భూమికీ సూర్యుడికీ ఉన్న దూరం.. భూమిపై రుతువులు, ఉష్ణోగ్రతలను నిర్ణయిస్తుందని అందరూ భావిస్తారు. అది నిజం కాదు. సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు భూమి తన అక్షం మీద కలిగివున్న వంపుని బట్టీ ఋతువులు ఉంటాయి. ఉదాహరణకు జనవరిలో, ఉత్తరార్థగోళంలో చాలా దేశాల్లో శీతాకాలం ఉంటుంది. అప్పుడు దక్షిణార్ధగోళంలో వేసవి ఉంటుంది. జూలైలో భూమి సూర్యుడికి అత్యంత దూరంలో ఉంటుంది. జనవరిలో దగ్గరగా ఉంటుంది. ఈ కాలంలో భారతదేశంలో చలి ఎక్కువగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఎందుకు ప్రభావం చూపదు? : భూమి.. సూర్యుడి దగ్గరగా వస్తే ఉష్ణోగ్రతలు పెరిగాలి కదా అనే డౌట్ మనకు ఉంటుంది. నిజానికి భూమి, సూర్యుడి మధ్య దూరం 14.70 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. ఒకరకంగా ఇదేమంత దగ్గరగా ఉన్నట్లు కాదు. సూర్యుడి వేడి ఇంత దూరం వచ్చేలోపు చాలా వరకూ వాతావరణంలో చల్లదనం వల్ల వేడి తగ్గిపోతుంది. ఇక భూ వాతావరణంలో ఓజోన్ పొర.. సూర్యుడి అతినీలలోహిత కిరణాలను అడ్డుకుంటుంది. అందువల్లే మనకు అతి వేడి అనిపించదు. (ప్రతీకాత్మక చిత్రం)
ఎండాకాలంలో వేడి ఎందుకు? : మనకు ఎండాకాలం ఫిబ్రవరి మధ్య నుంచి మొదలై జులై మధ్య వరకూ ఉంటుంది. ఆ సమయంలో భూమి అక్షపు వంపు కారణంగా.. దక్షిణార్థగోళం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. ఉత్తరార్థగోళం సూర్యుడికి దూరంగా ఉంటుంది. అందువల్ల సూర్యకిరణాలు దక్షిణార్థగోళంపై నిట్టనిలువుగా పడతాయి. ఆ సమయంలో భారత్‌పై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి. అందువల్ల వేడి పెరుగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)