Onion Bulb Farming : వ్యవసాయాన్ని వాతావరణ జూదం అంటారు. ఎందుకంటే పంట చేతికి వచ్చేదీ లేనిదీ వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. కానీ మీకు తెలుసా.. గుజరాత్లో యువత.. భారీ శాలరీలు వచ్చే ఉద్యోగాలు వదిలేసి.. వ్యవసాయం చేస్తున్నారు. ఎందుకంటే అందులో లాభం సాధించే కిటుకులు వాళ్లకు అర్థమయ్యాయి. అలాగని ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఆధునిక వ్యవసాయ విధానం కాదు. ఇదో సంప్రదాయ వ్యవసాయం. కానీ లక్షలు సంపాదించే వీలు ఉంటోంది. ఎలాగో చూద్దాం.
.. సౌరాష్ట్రలోని అమేలీ భావ్‌నగర్ పాంథక్లో చాలా మంది యువత.. వజ్రాల పరిశ్రమలో చేరేవారు. మంచి శాలరీలు పొందుతూ.. సూరత్‌లో సెటిల్ అయ్యేవారు. అమ్రేలీలోని సవర్కుండ్ల తాలూకాకి చెందిన ఈ యువ రైతు.. సడెన్‌గా సూరత్‌ని వదిలేసి సొంతూరుకు వచ్చేశాడు. భారీగా వ్యవసాయం చెయ్యాలనుకున్నాడు. ముందుగా ప్రయోగాత్మకంగా.. చిన్నగా ఉల్లి సాగు ప్రారంభించాడు.
ఉల్లి సాగుతోపాటూ ఈ రైతు మరో అడుగు ముందుకు వేశాడు. ఇతను ఉల్లి ట్యూబ్స్ ఉత్పత్తి మొదలుపెట్టాడు. వేగంగా ఉల్లిసాగు చేపట్టాలంటే.. ఈ ఉల్లి ట్యూబ్స్ అవసరం. ఇప్పుడు భారీగా ఉల్లి బల్బులను సాగుచేస్తున్న ఈ రైతు.. వాటిని ఇతర రైతులకు అమ్ముతున్నాడు. ఇలా విపుల్ భాయ్ సవాలియా.. ఉల్లి పంటతోపాటూ.. ట్యూబ్స్ కూడా తయారుచేస్తూ.. భారీగా సంపాదిస్తున్నాడు.
ఉల్లి సాగు విషయంలో ట్యూబ్స్ నాటిన తర్వాత.. మరీ ఎక్కువ నీరు పొయ్యకూడదు. ఓ పది రోజుల్లో మొలకలు పెరుగుతాయి. ట్యూబ్స్ నాటే ముందు మట్టిలో 1 కేజీ బసాలీన్ కలపాలి. దీని వల్ల తుప్పలు, గడ్డి మొక్కలు రావు. ఉల్లి మొలకలు వచ్చాక... 1000 లీటర్ల నీటిలో 6 లీటర్ల Tok E 25 కలిపి పిచికారీ చేస్తున్నాడు. దాని వల్ల ఉల్లి మొక్కలకు చీడ పీడల సమస్య రావట్లేదు.