E-cycle: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి కదా... అందువల్ల ప్రజలు ఆల్టర్నేట్ అవకాశాల్ని బలవంతంగా వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ బైకులు, ఈ-స్కూటర్లు, ఈ-సైకిళ్ల తయారీ బాగా పెరిగింది. వీటికి డిమాండ్ కూడా ఓ రేంజ్లో ఉంది. గుజరాత్లో ఇండస్ యూనివర్శిటీలో విద్యార్థులు... తెవా పేరుతో... ఎలక్ట్రిక్ బైస్కిల్ తయారుచేశారు. వాళ్లు సరదాగా తయారుచేస్తే... దానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. మాక్కావాలి, మాక్కావాలి అని అంతా అడగటం మొదలుపెట్టారు. దాంతో విద్యార్థులకే ఆశ్చర్యం కలిగింది. మొబైల్లో వాడే లిథియం అయాన్ బ్యాటరీ లాంటిదే... ఈ సైకిల్‌కి కూడా వాడారు. ఇది గంటకు 35 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు.
ఈ రోజుల్లో చాలా మంది సైకిల్ని బరువు తగ్గడానికీ, ఎక్సర్సైజ్ కోసం వాడుతున్నారు. సో... ఈ విద్యార్థులు వాడిన సైకిల్ బండగా, లావుగా ఉంది. కాబట్టి... దీన్ని పెడల్స్ తొక్కుతూ వెళ్తే అంత వేగంగా వెళ్లదు. కాబట్టి... బాడీలో కొవ్వంతా ఐస్‌క్రీమ్‌లా కరిగిపోతుంది. ఇలా కావాల్సినంతసేపు ఎక్సర్సైజ్ చేసి... ఆ తర్వాత బ్యాటరీని వాడుకొని.. రయ్యిన దూసుకుపోవచ్చు. ఇలా రెండు రకాలుగా ఇది పనిచేస్తుంది. ఐడియా బాగుంది కదా.
ఇండస్ యూనివర్శిటీలో ఆటోమొబైల్ చదివే విద్యార్థులు... తమకు ఉద్యోగం వచ్చాక... టాలెంట్ చూపించడం గొప్పేమీ కాదు అనుకున్నారు. సో... యూనివర్శిటీలో చదివేటప్పుడే తమ టాలెంట్ చూపించాలి అనుకున్నారు. ఫలితంగా ఈ సైకిల్ సృష్టించారు. "దీనికి 7500 mAh లిథియం అయాన్ బ్యాటరీ వాడాం. అది 4 ఏళ్లపాటూ పనిచేస్తుంది. ఈ బ్యాటరీని 2 గంటల్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ సైకిల్ గంటకు 35 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీనికి ముందు, వెనక కూడా డిస్క్ బ్రేకులు వాడాం. కాబ్టటి వేగంగా వెళ్లినా సడెన్ బ్రేక్ బాగా పడుతుంది" అని విద్యార్థి అమిత్ తెలిపాడు.
ఈ బైస్కిల్‌కి హెడ్‌లైట్ కూడా సెట్ చేశారు. అంతే కాదు... డిస్ప్లే కూడా ఉంది. సైకిల్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే... డిస్ప్లేలో ఎర్రర్ చూపిస్తుంది. అలాగే... బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉందో డిస్ప్లేలో చూసుకోవచ్చు. అమిత్ సుమిత్, దర్శల్, హిమాన్షు... మరో నలుగురు విద్యార్థులు కలిసి దీన్ని తయారుచేశారు అని యూనివర్శిటీ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ సుకేతు జానీ తెలిపారు.
ఈ సైకిల్ తయారీ కోసం యూనివర్శిటీ, SSIP కలిసి విద్యార్థులకు రూ.1.8 లక్షలు ఇచ్చాయి. ఈ రోజుల్లో మార్కెట్లో లభిస్తున్న చాలా ఎలక్ట్రిక్ సైకిళ్లకు జస్ట్ బ్యాటరీని అమర్చి అమ్మేస్తున్నారు. ఇది అలాంటిది కాదు. దీనికి జీపీఎస్, ఇంటర్నెట్ వంటి అదనపు సదుపాయాలు కల్పించాము అని విద్యార్థులు తెలిపారు. త్వరలోనే దీన్ని దేశవ్యాప్తంగా విడుదల చేస్తామనీ... ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అదే జరిగితే... ఇదో స్టార్టప్ అయ్యే అవకాశం ఉంటుంది.