దీనిపై ఆయుష్ తల్లిదండ్రులు స్పందిస్తూ.. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప రచయితల గురించి మా బాబు అడుగుతున్నాడు. అతడికి పుస్తకాలు చదవడం ఇష్టం. అతడు వార్తా పత్రిక కూడా క్రమం తప్పకుండా చదువుతాడు. అతడి కోసం మేం చాలా పుస్తకాలు కొనాల్సిఉంది. చివరిసారి ఆయుష్ కోసం మేం 40 పుస్తకాలు కొన్నాం. అవి కూడా అయిపోయే దశకు చేరుకున్నాయి’ అంటున్నారు.