1. ప్రపంచంలో కొన్ని ఉద్యోగాలు చాలా విచిత్రంగా ఉంటాయి. పెంపుడు శునకాలను చూసుకునేవారికి లక్షల్లో జీతాలు ఇస్తుంటారు. పెంపుడు జంతువుల్ని నవ్వించే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అలాంటి ఉద్యోగాలకూ మంచి జీతం ఉంది. ఇప్పుడు మరో ఉద్యోగం హాట్ టాపిక్‌గా మారింది. లెక్కపెట్టడం వస్తే చాలు... లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం ఇస్తోంది ఓ సంస్థ. (ప్రతీకాత్మక చిత్రం)
2. యూకేకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ తమ పోస్ట్ ఆఫీస్, మ్యూజియం కోసం ఉద్యోగుల్ని నియమించుకుంటోంది. వారంతా అంటార్కిటికా ద్వీపంలో ఐదు నెలల పాటు ఉద్యోగం చేయాలి. వారు చేయాల్సిన ఉద్యోగం ఏంటో తెలుసా? అక్కడ ఉన్న పెంగ్విన్స్ని లెక్కపెట్టడమే. అవును. అక్కడ ఎన్ని పెంగ్విన్స్ ఉన్నాయో లెక్కపెడితే చాలు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ప్రస్తుతం ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఆ సంస్థ. ఎంపికైనవారు అంటార్కిటికా ద్వీపంలో బ్రిటీష్ అంటార్కిటిక్ సర్వే కోసం దీర్ఘకాల జనాభా పర్యవేక్షణ కార్యక్రమంలో పాల్గొనాలి. పెంగ్విన్స్ని, వాటి గుడ్లను, ఇతర వన్యప్రాణుల్ని లెక్కపెట్టాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అంతర్జాతీయ అభ్యర్థులు కూడా అప్లై చేయొచ్చు. అయితే వారికి యూకేలో పనిచేసే హక్కు ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. కరోనా వైరస్ మహమ్మారి తర్వాత తొలిసారి యూకే అంటార్కిటిక్ హెరిటేజ్ ట్రస్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. 2022-23 సీజన్ కోసం అంటార్కిటికాలోని పోర్ట్ లాక్రాయ్లో కొత్త టీమ్‌ను రిక్రూట్ చేస్తున్నామని, బేస్ లీడర్, షాప్ మేనేజర్, జనరల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయని యూకే అంటార్కిటిక్ హెరిటేజ్ ట్రస్ట్ తెలిపింది. ఈ ఉద్యోగాలకు నెలకు రూ.1,24,000 నుంచి రూ.1,78,000 మధ్య జీతం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. గతంలో ఈ ఉద్యోగం చేసినవారు తమ అనుభవాలను కూడా పంచుకుంటున్నారు. గతంలో ఓ స్టేషన్లో పోస్ట్‌మాస్టర్‌గా పనిచేసిన విక్కీ ఇంగ్లిస్ ఈ ఉద్యోగం గురించి మాట్లాడుతూ పెంగ్విన్స్‌తో పాటు వాటి గుడ్లను లెక్కించాలని చెప్పారు. ఇలాంటి ఉద్యోగం జీవితంలో లభించే అరుదైన అవకాశం అని చెప్పడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
7. పోర్ట్ లాక్‌రాయ్ అంటార్కిటిక్ ప్రాంతంలో స్థాపించబడిన మొట్టమొదటి శాశ్వత బ్రిటిష్ శాస్త్రీయ పరిశోధనా స్థావరం. ఇది 1944 మరియు 1962 మధ్య పనిచేసింది. 2006లో యూకే అంటార్కిటిక్ ట్రస్ట్ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి దీనిని పరిరక్షణ బాధ్యతల్ని చూడటం మాత్రమే కాకుండా పర్యాటక ప్రదేశంగా నిర్వహిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)