పెళ్లికి వచ్చేవాళ్లు కడుపునిండా తినాలి.. మనసునిండా ఆనందంతో తిరిగి వెళ్లాలి..! ఇదే ఫార్ములాను ఫాలో అవుతుంటారు పెళ్లి పెద్దలు..! ఇక వెడ్డింగ్ కార్డుల డిజైన్ గురించి పెద్ద చర్చే పెడతారు..! వివిధ రకాల డిజైన్లు, దేవుడి బొమ్మలు, ప్రేమను పంచే చిత్రాలు..ఇలా రకరకాల డిజైన్ల గురించి రోజులకు రోజులు చర్చించి లాస్ట్‌కి ఒక మోడల్‌ను సెలక్ట్ చేస్తారు.
అదే వచ్చిన అతిథులకు జీవితాంతం గుర్తుండాలంటే ఏం చేయాలి..? కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయాలా..? ఆకాశమంతా పందిరి వేయ్యాలా..? లేదు అవసరమే లేదని నిరూపించారు అమ్రేలీకు చెందిన పోలీస్ కపుల్. తమ పెళ్లి కేవలం ఆనందం మాత్రమే కాదు.. మీ భవిష్యత్ తరాలకు భరోసా అంటూ ప్రూవ్ చేశారు. అది కూడా ఓన్లీ వెడ్డింగ్ కార్డుతోనే..!
నిజానికి అది కేవలం పెళ్లి ఆహ్వాన పత్రిక కాదు.. మన జేబుల్లో డబ్బులు కేటుగాళ్ల చేతిలోకి వెళ్లకుండా చేసే బుక్లెట్..! సైబర్ నేరగాళ్ల నుంచి మన బ్యాంక్ అకౌంట్లలోని నగదుకు భద్రత కల్పించే మాస్టర్‌పీస్..! ఇదేంటి..? వెడ్డింగ్ కార్డుకి.. సైబర్ నేరగాళ్ల నుంచి కాపాడుకోవడానికి లింకేంటి అనుకుంటున్నారా..? అయితే రీడ్ థిస్ స్టోరీ..!
సైబర్ఫ్రాడ్ల నుంచి ప్రజలను రక్షించే చట్టాలను.. బాధితులు పోలీసులను ఎలా సంప్రదించవచ్చో కూడా అతను వివరించాడు.మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు, సోషల్ మీడియాల్లో గోప్యత కోసం సెట్టింగ్‌లను ఎలా ఉపయోగించడంలో కూడా వెడ్డింగ్ కార్డులో చెప్పాడు. సైబర్ నేరగాళ్ల నుంచి ప్రజలను రక్షించే చట్టాలతో పాటు హెల్ప్‌లైన్ నంబర్లను కార్డులో ప్రింట్ చేయించాడు. ఇలా వచ్చే అతిథులకు ముందుగానే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన మనోడి ఐడియాపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిజంగా ఇది ట్రూలీ గ్రేట్ ఐడియా.